ఇటీవల సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అందులో ఫుడ్డింగ్ కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. జిహ్వాకో రుచి.. బుద్దికో ఆలోచన.. అన్నట్లుగా… పామును చూసినా.. పాము బొమ్మలను చూసిన భయంతో పారిపోతాం.. కానీ అందరూ ఎంతో ఇష్టంగా తినే చాక్లెట్‌తో ఏకంగా పామునే తయారు చేశాడు. . ప్రస్తుతం చాక్లెట్ పాము వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను సుప్రసిద్ధ స్విస్ ఫ్రెంచ్ చెఫ్ అమౌరీ గుయిచోన్ ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో కింగ్ కోబ్రా చాక్లెట్ మాస్టర్ పీస్‌ను సిద్ధం చేస్తూ కనిపించాడు.
దీనిని రెడీ చేయడానికి తనకు దాదాపు 8 గంటలు పట్టిందని తెలిపాడు.. ఈ వీడియోలో చాక్లెట్‌తో కుండను రెడీ చేసి.. దానిపై నాగుపాము ఉన్నట్లుగా చాక్లెట్ తో రెడీ చేశాడు. నిజమైన పామును తలపించే విధంగా ఆ చాక్లెట్ స్నేక్ తయారు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఆ వీడియోకు 4.5 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో గుయిచోన్‌కు 7.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇటీవల చాక్లెట్ తో చెట్టు.. పక్షి తయారు చేసి అదుర్స్ అనిపించాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..
Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..
RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్..