Viral: ఆరోగ్యంపై జాలి కాదు.. నైపుణ్యానికి తగిన జాబ్ కావాలంటున్న వ్యక్తి.. సీఈవోల నుంచి వరుస ఆఫర్లు..
Viral: సమస్యల వలయంలో చిక్కుకుని పోరాడే వాళ్లు కోరుకునేది ఇతరుల నుంచి కొంచెం మద్ధతు మాత్రమే. కానీ బాధలో ఉండే వారికి జాలి అవసరం లేదు. ఇంతకీ మ్యాటర్ ఏమిటంటే..
Viral: సమస్యల వలయంలో చిక్కుకుని పోరాడే వాళ్లు కోరుకునేది ఇతరుల నుంచి కొంచెం మద్ధతు మాత్రమే. కానీ బాధలో ఉండే వారికి జాలి(Sympathy) అవసరం లేదు. బాధలతో సతమతమౌతున్న వారందరూ చెడ్డవారుగా భావించటం చాలా పెద్ద తప్పు. వారు ఆ పరిస్థితులను ఎందుకు ఎదుర్కొంటున్నారో తెలియకుండా మనం వ్యవహరించకూడదు. సదరు వ్యక్తులను చూడగానే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మార్చాల్సిన అవసరం లేదంటూ ఒక వ్యక్తి సోషల్ మీడియోలో చేసిన ఒక పోస్టు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ పోస్టు పెట్టిన మరుక్షణమే అతన్ని మెచ్చకోవటంతో పాటు.. తమ కంపెనీలో ఉద్యోగం చేయాలంటూ అనేక మంది సీఈవోలు అతనిపై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ అసుల మ్యాటర్ ఏమిటో ఇప్పుడు ఒకసారి చూద్దాం..
ఝార్ఖండ్‌కి చెందిన ఆర్ష్ నందన్ ప్రసాద్ అనే వ్యక్తి తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా అతనికి తెలిసిన ఒక నిజం షాక్ కి గురిచేసింది. అదేంటంటే అతని శరీరంలో ఉన్న క్యాన్సర్(Cancer) మహమ్మారి అతని ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోందని తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఒక పక్క చిన్నపాటి ఉద్యోగం చేస్తూనే.. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం జూమ్ కాల్ లో ఇంటర్వ్యూలకు హాజరవుతున్నాడు. ఇంటర్వ్యూలో అడుగుతున్న ప్రశ్నలకు నందన్ సరైన సమాధానలు ఇస్తూనే ఉన్నాడు. అయితే ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తులకు అతనిచ్చే సమాధానాల కంటే అతని ఆరోగ్య పరిస్థితిపైనే ఎక్కువ జాలి చూపటం కొత్త ఇబ్బందులు తెచ్చి పెట్టింది. జాబ్ ఇవ్వడం మాట అటుంచి.. ఆస్పత్రి బెడ్‌పై ఉన్న అతన్ని చూడగానే ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మార్చడం, జాలిగా మాట్లాడటంతో పాటు అతని నైపుణ్యాలు, సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేయడం ఎక్కువైంది.
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రసాద్‌కి ఇంటర్వ్యూయర్ల ప్రవర్తన విసుగు కలిగించింది. కీమో థెరపీతో క్యాన్సర్‌తో పోరాడే సమయంలో వీళ్ల ప్రవర్తన తనకు ఇబ్బందిగా ఉంటోందని పేర్కొటూ లింక్‌డ్ ఇన్‌లో అతను మేసేజ్ పెట్టాడు. అందులో నా స్కిల్స్, సామర్థ్యం చూడండి అంతే కానీ నాకున్న అనారోగ్యాన్ని చూసి జాలి పడొద్దు. ఇప్పుడు నందన్ ప్రసాద్ లింక్డ్‌ఇన్ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది. మహారాష్ట్రకు చెందిన అప్లైడ్ కంప్యూటింగ్ సంస్థ సీఈవో నీలేశ్ సప్తూర్ దీనిపై స్పందించారు. క్యాన్సర్‌తో ధైర్యంగా పోరాడుతున్న నువ్వు ఒక యోధుడివి. ఇకపై ఇంటరర్వ్యూలు ఇవ్వడం ఆపేయ్. నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టు. ట్రీట్‌మెంట్ తీసుకో. నీ క్రెడెన్షియల్స్ నేను చూశాను. అన్నింటా సూపర్‌గా ఉన్నావు. నీలాంటి యోధుడికి మా కంపెనీలో ఎప్పుడూ ఉద్యోగం రెడీగా ఉంటుంది. నువ్వు కావాలనుకున్నప్పు వచ్చి జాయిన్ అవమంటూ ఆఫర్ ఇచ్చారు. విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలకు చెందిన సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి సానుకూల అతని పోస్ట్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పుడు నందన్ ఎదుర్కొంటున్న సమస్య వల్ల వాస్తవ పరిస్థితులు మారాలంటూ అనేక మంది గళం విప్పుతున్నారు. ఈ విషయం ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
మరిన్ని జాతీయ వార్తలు చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇవీ చదవండి..
Solar Hotel: విశాఖలో ఔరా అనిపిస్తున్న సోలార్ హోటల్.. దీని ప్రత్యేకతలేమిటంటే..
Economic Crisis: భారత్ మరో శ్రీలంకగా మారుతుందా..! గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే..