Solar Hotel: విశాఖలో ఔరా అనిపిస్తున్న సోలార్ హోటల్.. దీని ప్రత్యేకతలేమిటంటే..
Solar Hotel: ఈ రోజుల్లో కరెంట్ కష్టాలు మామూలుగా లేవు. ఒకపక్క కరెంటు కోతలు, మరోపక్క పెరుగుతున్న కరెంటు బిల్లులు(Power Bills) కలిపి అందరి చూపు ప్రస్తుతం సోలార్ వైపు పడింది.
Solar Hotel: ఈ రోజుల్లో కరెంట్ కష్టాలు మామూలుగా లేవు. ఒకపక్క కరెంటు కోతలు, మరోపక్క పెరుగుతున్న కరెంటు బిల్లులు(Power Bills) కలిపి అందరి చూపు ప్రస్తుతం సోలార్ వైపు పడింది. వారి అవసరాలకు అనుగుణంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనేక మంది చిన్న ప్లాంట్లను కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏపీలోని స్మార్ట్ సిటీ అయిన విశాఖలో(Vizag) ఒక స్మార్ట్ భవనం వెలుస్తోంది. దూరం నుంచి చూసే వారికి అది సాధారణ భవంతి లాగానే కనిపిస్తుంది. దగ్గరకు వెళ్లి చూసిన వారు మాత్రం అవాక్కవుతున్నారు. ఇంతకు అసలు ఆ బిల్డింగ్ ప్రత్యే కత ఏమిటో తెలుసుకోవాలని మీకూ అనిపిస్తోందా.. అసలు దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి..
వైజాక్ నగరంలో నిత్యం రద్దీగా ఉండే గురుద్వారా జంక్షన్ వద్ద ఒక ఆధునిక భవంతి వెలుస్తోంది. అది ఒక హోటల్. ఇది 100 శాతం గ్రీన్ బిల్డింగ్. ఈ అత్యాధునిక హోటల్ ను సదరు వ్యాపారి ఆలోచన మేరకు పూర్తిగా సోలార్ ప్యానెల్స్ తో కప్పారు. అవి చూడటానికి డిజైన్ లాగా కనిపిస్తున్నాయి. కానీ అసలు మ్యాటర్ తెలుసుకున్న వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. సహజంగా ఇలాంటివి మనం విదేశాల్లో నిర్మించారని వార్తల్లో వింటుంటాం. కానీ.. ఇప్పుడు అలాంటి భవనం మన విశాఖలో అందుబాటులోకి రావటం నగరానికి మరింత పేరును తెచ్చిపెడుతోంది. ఈ స్మార్ట్ హోటల్ భవిష్యత్తుకు చాలా దగ్గరగా నిర్మాణం అవుతోందని తెలుస్తోంది.
భవనం విశేషాలు ఏమిటంటే..
అయిదు అంతస్తుల ఈ స్మార్ట్ హోటల్ భవనానికి మొదటి అంతస్తు నుంచి భవంతి పైవరకూ చుట్టూ సోలార్ ప్యానెల్స్ ను అందంగా ఏర్పాటు చేశారు. ఈ ప్యానెల్స్ రోజుకు 78 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయని నిర్వాహకులు వెల్లడించారు. నెట్ మీటరింగ్ ద్వారా వినియోగం తరువాత మిగిలిన విద్యుత్తును సదరు హోటల్ గ్రిడ్ కు అందిస్తుంది. దీని ద్వారా వారికి అదనంగా ఆదాయం లభిస్తుంది. ఎలివేషన్ కోసం నలుపురంగు అద్దాలకు బదులు.. ఈ సోలార్ ప్యానళ్లను బిగించటం వల్ల కొద్దిగా ఖర్చయినా కొత్తదనంతో పాటు అదనపు ఆదాయం రానుంది.
ఇవీ చదవండి..
RBI Investment: ఆర్బీఐ వద్ద రిస్క్ లేకుండా ఇలా పెట్టుబడి పెట్టండి.. బంపర్ ఆదాయం కూడా..
Share Price: కంపెనీ టాప్ మేనేజ్‌మెంట్ మారితే షేర్లు పతనమోతాయా..? ఇన్వెస్టర్లు ఏమి చేయాలి..