Viral Video: ఈ స్మార్ట్ యుగంలో పిల్లులు కూడా స్మార్ట్‌గా మారిపోతున్నాయ్.. ఈ వీడియో చూస్తే మీరూ ఇదే అంటారు..
Viral Video: ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్‌లను ఉపయోగించేస్తున్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా మనుషులు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌నెస్ కేవలం...
Viral Video: ప్రస్తుతం అంతా స్మార్ట్ యుగం నడుస్తోంది. చిన్న పిల్లలు కూడా స్మార్ట్ ఫోన్‌లను ఉపయోగించేస్తున్నారు. మారుతోన్న కాలానికి అనుగుణంగా మనుషులు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నారు. అయితే ఈ స్మార్ట్‌నెస్ కేవలం మనుషులకే పరిమితమా అంటే కాదని సమాధానం చెబుతోందీ ఓ వైరల్ వీడియో. నెట్టింట చక్కర్లు కొడుతోన్న ఓ వీడియో మనుషులే కాదు జంతువులు కూడా స్మార్ట్‌గా మారిపోయాయని చెప్పకనే చెబుతోంది. ఓ పిల్లి చేసిన పని ఇప్పుడు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ పిల్లికి దాహం వేసింది. చుట్టూ ఎక్కడ నీరు కనిపించలేదు. అక్కడే ఓ వాటర్ కూలర్ కనిపించింది. మనుషులు అయితే ట్యాప్‌ను తిప్పి నీటిని తాగుతారు. మరి పిల్లి పరిస్థితి ఏంటి.? అది మాములు పిల్లి అయితే ఏం చేసేదో తెలియదు గానీ.. ముందుగా చెప్పినట్లు అది స్మార్ట్ పిల్లి. వెంటనే వాటర్ కూలర్ దగ్గరికి వెళ్లిన పిల్లి ఎంచక్కా ట్యాప్‌ను కిందికి వంచి గటగటా నీటిని తాగేసింది. దీనంతటినీ అక్కడే ఉన్న వ్యక్తి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట తెగ సందడి చేస్తోంది.
Stay hydrated.. ? pic.twitter.com/zBUD1fDsce
— Buitengebieden (@buitengebieden) August 10, 2022
పిల్లి స్మార్ట్‌నెస్‌ను చూసిన జనాలు ఔరా అనుకుంటున్నారు. మనుషులను చూసిన నేర్చుకోవడంలో పిల్లులు ముందుంటాయి అని ఒక యూజర్ కామెంట్ చేయగా, జంతువులు చాలా తెలివైనవని మరో యూజర్ కామెంట్ చేశాడు. ఈ వీడియోను ఇప్పటి వరకు 8 లక్షల మంది వీక్షించగా, 2.6 లక్షల మంది లైక్ చేశారు. 38వేల మందికిపైగా రీట్వీట్ చేయడం విశేషం.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..