Optical Illusion: ఈజీనే.. కాకపోతే కాస్త గజిబిజి.. ఈ ఫోటోలో గుడ్లగూబ ఎక్కడుందో కనిపెట్టండి

Viral Photo: ఇది సోషల్ మీడియా యుగం. ప్రజంట్ అన్ని జనరేషన్స్ వాళ్లు సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. అయితే సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు పజిల్స్ కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. మీ కోసం ఓ కఠినమైన పజిల్.

Optical Illusion: ఈజీనే.. కాకపోతే కాస్త గజిబిజి.. ఈ ఫోటోలో గుడ్లగూబ ఎక్కడుందో కనిపెట్టండి
Find The Owl
Follow us
Ram Naramaneni

|

Updated on: May 20, 2022 | 6:44 PM

Spot the Owl: నెట్టింట రకరకాల కంటెంట్ వైరల్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా వాడనివారు ఎవరు ఉన్నారు చెప్పండి. కాగా ఈ మధ్య కాలంలో మీరు ఫోటో పజిల్స్‌ మీకు తారసపడే ఉంటాయి. ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాలు కూడా నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. సహజంగానే సెల్ఫ్ కాన్పిడెన్స్ ఉన్నవారికి ఏదైనా పజిల్ సాల్వ్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. ఇక ఛాలెంజ్ విసిరితే ఊరుకుంటారా? దాని పనిపట్టే వరకు వదిలిపెట్టరు. కాగా ఫోటో పజిల్స్ మీ కళ్లలో ఎంత పవర్ ఉందో కూడా చెప్పేస్తాయ్. ఈ ఫోటో పజిల్స్‌ అందించేందుకు కొన్ని సోషల్ మీడియా పేజీలు కూడా ఉన్నాయి. ఇలాంటి పజిల్స్ కొన్ని సులభంగా ఉన్నా, మరికొన్ని మాత్రం చాలా సంక్లిష్టంగా ఉంటాయి. తెగ తికమక పెడుతూ మనకి సవాల్ విసురుతాయి. వీడని చిక్కుముడిలా ఉండి మన కళ్లను మోసం చేస్తుంటాయి. మీ చూపుల్లో పదును ఉంటే వీటిని తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. ఏ మాటకామాటే చెప్పాలి.. వీటిని పరిష్కరిస్తే.. సంతృప్తిగా ఉంటుంది. లేదంటే ఏదో కోల్పోయిన ఫీలింగ్ ఉంటుంది.  ఇలాంటి ఛాలెంజింగ్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇంతకీ వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఏముందో ఓసారి లుక్కేద్దాం.

ఈ చిత్రం అడవిలో తీసినదిగా తెలుస్తోంది. అందులో ఓ గుడ్లగూబ దాగుంది. దాన్ని గుర్తించడం మీరు అనుకున్నంత ఈజీ మాత్రం కాదు. 100కు 60 మంది ఈ పజిల్ సాల్వ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. చూసిన కొద్ది సెకన్లలోనే మీరు గుడ్లగూబను  కనిపెడితే.. మీరు ఐ పవర్ అనే చెప్పాలి. ఎంతసేపు చూసినా.. కనిపించకుండా కన్‌ఫ్యూజ్ చేస్తుంటే దిగువ ఫోటోలను చూసేయ్యండి. వాటిలో గుడ్లగూబ ఎక్కడ ఉందో క్లియర్‌గా మార్క్ చేసి ఇచ్చాము.

Owl 1

ఇవి కూడా చదవండి

Owl 2