Viral Photo: బుర్ర హీటెక్కిపోద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ అదరహో

పని ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది పజిల్స్‌, సుడోకోల బాట పడతారు. వీకెండ్ బుక్స్, మ్యాగజైన్స్‌లో వచ్చే వివిధ రకాల పజిల్స్‌‌ను పరిష్కరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. వాటిలో ఫోటో పజిల్స్ కూడా ఓ పార్ట్.

Viral Photo: బుర్ర హీటెక్కిపోద్ది.. ఈ ఫోటోలో పామును కనిపెడితే.. మీ ఐ పవర్ అదరహో
Find The Snake, Credit: marks_reptiles/Instagram
Follow us
Ram Naramaneni

|

Updated on: May 26, 2022 | 9:28 PM

Picture Puzzle: ఇప్పుడు మొబైల్ ఫోన్ లేని వాళ్లు.. అందులో డేటా లేనివాళ్లు చాలా అరుదు. ఫోన్ ఉంటే… ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్లే. ఇది సోషల్ మీడియా జనరేషన్.  ఇక ఫన్ కోసం, కాలక్షేపం కోసం నెట్టింట బోలెడంత కంటెంట్ ఉంటుంది. ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో మనకు నచ్చిన వ్యూస్ పెట్టొచ్చు. రకరకాల వీడియోలు ఉంటాయి.  ఇవి కాకుండా పజిల్స్ కూడా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి.  ఛాలెంట్స్ ఇష్టపడేవారు పజిల్స్‌పై ఇంట్రస్ట్ చూపిస్తారు.  అయితే పజిల్స్‌లో చాలా టైప్స్ ఉన్నాయి. వీకెండ్ బుక్స్, మ్యాగ్‌జైన్స్‌లో వచ్చే పద సంపత్తికి సంబంధించిన పజిల్స్‌ ఓ రకమైతే.. ఫోటో పజిల్స్ మరో టైప్. ఒక ఫోటో చూపించి అందులో దాగున్న వ‌స్తువులు, జీవులను క‌నిపెట్ట‌డం…రెండు ఫోటోలు ఇచ్చి వాటిలోని మార్పుల‌ను గుర్తించ‌డ‌మే ఫోటో ఫజిల్స్ అంటారు. ఇక ఫోటో పజిల్స్‌ సాల్వ్ చేయడానికి  కాస్త పేషెన్స్ అవసరం. మెదడు యాక్టివ్‌గా పనిచేయాలి.  మీ చూపుల్లో పదునుండాలి. ఫోటోలో దాగున్న వస్తువును లేదా జంతువును.. కనిపెట్టేస్తే సూపర్ కిక్ వస్తుంది. తాజాగా ఓ ఫోటో పజిల్ ఇంటర్నెట్‌ను తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కష్టంగా ఉన్న ఈ పజిల్‌ను సాల్వ్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. నూటికి 95 మంది ఈ పజిల్ సాల్వ్ చేయలేకపోయారు.  మీరు పైన చూస్తోన్న ఫోటోలో ఓ ప్రమాదకర పాము దాగుంది. దాన్ని కనిపెట్టడం పెద్ద ఛాలెంజ్. మీ మెదడుకు కాస్త మేత వేయాలంటే ఈ పజిల్ సాల్వ్ చేయండి. మావల్ల కాదు… కష్టం అనిపిస్తే మాత్రం దిగువన ఫోటోను చూడండి.

Snake