మనం బోర్ కొట్టినప్పుడు ఏదైనా గేమ్ గానీ, వెబ్ సిరీస్ గానీ చూస్తుంటాం. కొంతమంది అయితే సుడోకో, లేదా పజిల్స్‌పై దృష్టి సారిస్తారు. సోషల్ మీడియాలో ఫోటో పజిల్స్ కోకొల్లలు. ఎప్పుడూ ఏదొకటి వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అయితే పాతవి కూడా మరోసారి హల్చల్ చేస్తుంటాయి. అలాంటి కోవకు చెందిన ఓ ఫోటో పజిల్‌ను ఇప్పుడు చూద్దాం..
పైన పేర్కొన్న ఫోటోలో ఓ మంచు చిరుత ఉంది. అదెక్కడ ఉందో మీరు కనిపెట్టాలి, కొండల రంగులో దాని రంగు కలిసిపోవడంతో.. ఆ మంచు చిరుత ఎక్కడ ఉందో కనిపెట్టడం కొంచెం కష్టమే. అయితే మీవి డేగ కళ్లయితే.. మీరు ఫస్ట్ ట్రయిల్‌లోనే కనిపెట్టొచ్చు. ఒక్కసారి ఫోటోపై లుక్కేయండి. కనిపెట్టేస్తే ఓకే గానీ.. లేదంటే సమాధానం కోసం క్రింద ఫోటోను చూడండి.
సాధారణంగా మంచు చిరుతలు ఎత్తైన పర్వతాలు, కొండలపై నివసిస్తుంటాయి. సాయంత్ర సమయాల్లో మంచు చిరుతలు ఎక్కువగా తిరుగుతాయి. ఇవి నీలి గొర్రెలను వేటాడటాయి. వేగానికి, చురుకుదనానికి మంచు చిరుతలు మారుపేరుగా నిలుస్తాయి. వీటి వేట మిగిలిన క్రూర మృగాలకు ఏమాత్రం తీసిపోదు.
Read Also: ఈ ఫోటోలోని జింకను కనిపెట్టండి.. మీ మెదడుకు మేత వేయండి.. ఈజీగా కనిపెట్టొచ్చు..
గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. దూకేసిన ప్రయాణీకులు.. చివరికి ఏం జరిగిందంటే.!
గజరాజుకు కోపమొస్తే ఇంతేనేమో.. అడవి దున్నను కుమ్మేసిందిగా.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంతే.!