
ఇటీవల గత కొద్ది రోజులుగా ఆప్టికల్ ఇల్యూషన్స్, పిక్చర్ ఫజిల్స్ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సరదాగా కనిపించే ఆ ఫోటోస్. (Optical Illusion). మీ వ్యక్తిత్వాన్ని.. మీలోని వివిధ కోణాలను బయటపెట్టేస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోస్ చూడడంలో మీ శ్రద్ద, కంటి చూపు, ఏకాగ్రత గురించి కూడా తెలుసుకుంటారు. అలాగే ఈ చిత్రాలు మీ మెదడుకు వ్యాయమంగా పనిచేస్తాయి. కంటిచూపును పదును పెట్టడంలోనూ సహయపడతాయి. తాజాగా ది మైండ్స్ జర్నల్ నివేదిక ద్వారా ఓ ఫోటోను మీ ముందుకు తీసుకువచ్చాం.. పైన ఫోటోను చూశారు కదా.. అందులో 8 అద్భుతాలు దాగున్నాయి.. అవెంటో కనిపెట్టగలరా ?.. పైన ఫోటోలో ఉన్న అద్భుతాలలో మీరు ముందు ఏదైతే గుర్తుపడతారో అది మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎలాగో తెలుసుకుందామా.
బెలూన్స్..
పైన ఫోటోలో మీరు ముందుగా బెలూన్స్ చూస్తే.. మీరు ఆశ, సానుకూల ఆలోచనలు కలిగి ఉండేవారని అర్థం. మైండ్ జర్నల్ ప్రకారం.. మీ మనస్సు నిలకడ లేకుండా ఉంటుంది.. మనసుపై.. ఆలోచనలపై నియంత్రణ ఉండదు.. ఎక్కువగా పగటి కలలు కంటారు. ఏ విషయాన్ని అయినా కరెక్ట్ అని నమ్మితే.. మీ మనసును ఎవరు మార్చలేరు..
పుస్తకం..
పుస్తకం చూస్తే మీకు అంతర్ దృష్టి ఉంటుంది. చాలా మంది మీ ముందు ఓపెన్ అవుతారు.. వారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్న సమయంలో మీ సలహాలు అడుగుతారు. ఎక్కువగా మీ సలహాలను తీసుకుంటారు. అంతేకాకుండా.. మీపై వచ్చిన సవాళ్లను.. నిందలను మీరు దయతో.. సులభంగా కట్ చేస్తారు.
గులాబీలు..
గులాబీలు చూస్తే… ప్రేమ మీ ఆయుధం. ప్రతిదానిలో అందమైన విషయాన్ని ఎంచుకుంటారు. ఎప్పుడూ శాంతియుతంగా.. ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అలాగే అనవసరమైన గాసిప్స్లో ఉండకండి.. అలాంటి విషయాలకు మీరు ఆకర్షితులు కారు.. ఇతరులను సంతోషపెట్టేందుకు ఎప్పుడూ మీ వంతు కృషి చేస్తారు.
టిల్టెడ్ క్రాస్..
వంపుతిరిగిన శిలువను చూసేవారు.. స్వీయ నియంత్రణ, క్రమశిక్షణగా ఉంటారు. మీ మనసును మరోకరికి ఇచ్చేందుకు ఇష్టపడతారు. ఎవరినైనా ఇష్టపడితే.. వారి కోసం ఏమైనా చేస్తారు. మీరు ఎక్కువగా స్వీయ నియంత్రణ కలిగి ఉంటారు. మీ సొంత స్వీయ నైపుణ్యంతో ఉంటారు.. కానీ ఇతరులను మచ్చిక చేసుకోవడానికి చాలా కష్టపడతారు.
సింహం..
ముందుగా సింహాన్ని చూస్తే.. మీకు ఆత్మ విశ్వాసం ఎక్కువ. మీపట్ల మీరు నిజాయితీగా ఉంటారు. మీ తప్పులను మీరు అంగీకరిస్తారు. మీ మంచి మనసుతో మీ తప్పులను కూడా సమానంగా అంగీకరిస్తారు.
టై..
మీరు ముందుగా టైని చూస్తే.. చాలా క్రమశిక్షణతో.. చాలా కష్టపడి పనిచేస్తారు. మీవల్ల కానీ పని పై ఇతరులకు భరోస ఇవ్వరు.. చేపట్టిన పనిని ఖచ్చితంగా పూర్తిచేస్తారు. అడ్డంకులకు భయపడరు.. మీకు వచ్చే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత ఉత్తేజపరుస్తుంది.
నవ్వుతున్న ముఖం..
నవ్వుతున్న ముఖం గమనిస్తే.. మీరు ఎప్పుడు ఇతరులలో పాజిటివిటీని మాత్రమే చూస్తారు. చుట్టూ ఉండేవారిలో ఎప్పుడు నవ్వును.. వారి సంతోషాన్ని చూస్తారు. మీకు ఎప్పుడూ ఒక పండగలా అనిపిస్తుంది. చుట్టూ సంతోషం ఉండాలనుకుంటారు.. నవ్వడం ఎప్పుడూ మిమ్మల్ని ఓడించదు..
గుండె..
మీరు ముందుగా గుండె.. లవ్ సింబల్ గుర్తిస్తే.. ఏ పరిస్థితుల్లో ఉన్నా.. ప్రేమను కనుగొనడానికి అంకితభావంతో ఉంటారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. శక్తివంతమైన వైద్యం చేసే పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా సంతోషాన్ని వ్యాప్తి చేస్తారు. మీరు ఇతరులపట్ల దయతో ఉంటారు. మీకు శత్రువులు ఎక్కువగా ఉండరు.. మీ దయ, క్షమించే గుణం చూసి మీ వద్దకు ఎక్కువగా వస్తారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
KGF Chapter 2: బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్ 2 ఊచకోత.. ఆమీర్ ఖాన్ దంగల్ రికార్డ్ బ్రేక్..
Viral Video: నాటు నాటు పాటకు పెళ్లికూతురు అదిరిపోయే డ్యాన్స్.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే..