Optical illusion: ఎలాంటి సందేహం లేకుండా ఈ ఫొటోలో ఉంది కుందేలు అనుకుంటున్నారు కదూ.? అయితే మీరు పొరబడినట్లే..
Optical illusion: ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోన్న వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు చూడడానికి సింపుల్‌గానే కనిపిస్తాయి కానీ ఆలోచనలను తికమక పెట్టిస్తాయి. కంటికి కనిపించేది...
Optical illusion: ప్రస్తుతం నెట్టింట తెగ ట్రెండింగ్ అవుతోన్న వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి. ఈ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు చూడడానికి సింపుల్‌గానే కనిపిస్తాయి కానీ ఆలోచనలను తికమక పెట్టిస్తాయి. కంటికి కనిపించేది ఒకటైతే అసలైన రూపం మరొకటి ఉంటుంది. మనిషి ఒక వస్తువును చూసే విధానం తన ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుందని సైకాలజీ చెబుతుంది.
వీటిలో ఓ భాగమే ఆప్టికల్ ఇల్యూజన్. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖ ఆర్టిస్టిలు ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలను డిజైన్ చేస్తున్నారు. దీంతో ఈ ఫొటోలు కాస్త నెట్టింట తెగ సందడి చేస్తున్నాయి. తమ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలనే క్యూరియాసిటీతో నెటిజన్లు సైతం వీటికి అట్రాక్ట్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా నెట్టింట ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోనే వైరల్ అవుతోంది. పైన ఉన్న ఫొటోను చూడగానే మీకు ఏం కనిపిస్తోంది. ఏముంది కుందేలే కదా అంటారా.? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. అది అసలు కుందేలే కాదు. జాగ్రత్తగా గమనిస్తే ఆ విషయం అర్థమవుతుంది. కుందేళ్లు చెవుల్లా కనిపిస్తున్నవి చెవులు కావు నిజానికి అవి మీసాలు. ముక్కులా కనిపిస్తోంది నుదురు. అవును మీరు చదివింది నిజమే. కావాలంటే ఓసారి ఫొటోను రివర్స్ చేసి చూడండి అసలు విషయం అర్థమవుతుంది. ఇప్పుడర్థమైందా అది కుందేలు కాదు పెద్ద మీసాలున్న ఓ మనిషి ముఖం. చూసే కళ్లను మాయ చేసేలా ఉన్న ఈ ఆప్టికల్ ఇల్యూజన్ నిజంగా భలే ఉంది కదూ.!
మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..