
ప్రపంచంలో అత్యంత సహనం ఉంది కేవలం ఒక్క ప్రకృతికి మాత్రమే. మనిషి ఆగడాలను భరిస్తూ ఒపికగా ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా చెట్లు. మానవ మనుగుడకు ప్రధాన మూలమైన చెట్లను నరికివేస్తున్నారు. అడవులను మాయం చేసి ఖరీదైన భవనాలను నిర్మిస్తున్నారు. కానీ కొన్నిసార్లు ప్రకృతి తన కోపాన్ని పలు విధాలుగా చూపిస్తుంది. ప్రకృతికి పగను మనిషి ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అలాంటి వీడియోనే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందులో తనను నరికివేసిన వ్యక్తికి చెట్టు చుక్కలు చూపించింది. ఈ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహింద్రా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆనంద్ మహీంద్రా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ ప్రకృతి పగ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అందులో ఓ అడవిలో ముగ్గురు వ్యక్తులు భారీ వృక్షాన్ని మొదళ్ల వరకు నరికివేశారు. అనంతరం చెట్టును పడగొట్టేందుకు పెద్ద గొలుసును ఉపయోగించారు.ఆ తర్వాత ఆ చెట్టును పక్కకు పడేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ వృక్షం మొదలు అందులోని ఓ వ్యక్తిని తాకి గాల్లోకి ఎగురవేసింది. ఆ తర్వాత నేలపై బొక్కబోర్లా పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు ప్రపంచాన్ని రక్షించాలనుకుంటే మీరు ప్రకృతిని కూడా రక్షించాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చెట్లను కాపాడుకోవడం వలన ప్రకృతి వైపరీత్యాల నుంచి సురక్షితంగా ఉంటాం అంటున్నారు నెటిజన్స్.
If you cut down trees, they won’t take it lying down ??????pic.twitter.com/TekNZiQSTF
— anand mahindra (@anandmahindra) August 23, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.