అయ్యాయ్యో మంటల్లో కాలిపోతున్న కరెన్సీ నోట్లు..! ఎక్కువైతే పేదలకు పంచండి.. నెటిజన్ల రియాక్షన్‌

రూ.100, రూ.500 నోట్లు కాలిపోతున్నట్లు చూపించిన వీడియో ఒకటి ఈ దీపావళి సందర్భంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో పెద్ద సంఖ్యలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడిపోతున్నాయి. అయితే, ఈ వీడియో ఎక్కడిద..? ఎవరు ఇలా చేశారు అనేది మాత్రం

అయ్యాయ్యో మంటల్లో కాలిపోతున్న కరెన్సీ నోట్లు..! ఎక్కువైతే పేదలకు పంచండి.. నెటిజన్ల రియాక్షన్‌
Currency Burnt
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 02, 2024 | 7:31 PM

వెలుగుల పండుగ దీపావళి నాడు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లు, ఆఫీసులో జరుపుకున్న వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కానీ, దీపావళి పండుగ సందర్భంగా కరెన్సీ నోట్లను తగలబెడుతున్న వ్యక్తి వీడియో వైరల్ అవుతోంది. రూ.100, రూ.500 నోట్లు కాలిపోతున్నట్లు చూపించిన వీడియో ఒకటి ఈ దీపావళి సందర్భంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కొన్ని సెకన్ల ఈ వీడియోలో పెద్ద సంఖ్యలో కొత్త కరెన్సీ నోట్లు మంటల్లో తగలబడిపోతున్నాయి. అయితే, ఈ వీడియో ఎక్కడిద..? ఎవరు ఇలా చేశారు అనేది మాత్రం తెలియరాలేదు. వీడియోని ఇప్పటికే వేల సంఖ్యలో వీక్షించారు.

సమాచారం ప్రకారం, ఈ వీడియోను కుమార్ దినేష్ భాయ్ అనే వినియోగదారు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్‌ చేశారు. ఇప్పటి వరకు 3200 మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై పెద్ద సంఖ్యలో ప్రజలు కామెంట్ చేస్తున్నారు. అయితే, కొందరు వీడియోపై కామెంట్ చేస్తూ.. ఇదంతా రీల్స్‌ పిచ్చితో చేసిన పనిగా పేర్కొన్నారు. మీరు డబ్బులు అవసరం లేకుంటే నిరుపేదలకు పంచిపెట్టండి అని మరొకరు చెప్పారు. కానీ, కొందరు మాత్రం కాలిపోయిన నోట్ల వెనుక అసలు కారణాన్ని గుర్తించారు. ఆ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన అసలు నోట్లు కావని అంటున్నారు. మొత్తానికి వీడియో మాత్రం వైరల్‌గా మారింది.

ఇవి కూడా చదవండి

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం, ఏదైనా నోటును నాశనం చేసినా లేదా కాల్చినా ఏడేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. నోట్లను కాల్చడం జాతీయ కరెన్సీని అవమానించడమేనని, అది మన దేశంలో దేశద్రోహం కిందకు వస్తుందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..