Viral Video: బాహుబలి ఎద్దు.. ఒక్క దెబ్బతో కారును ఎత్తిపడేసింది.. వీడియో చూస్తే అవాక్కే..
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు ట్రెండ్ అవుతుంటాయి. ముఖ్యంగా యానిమల్స్ వీడియోలు అందరూ ఆసక్తిగా చూస్తారు. ఒక ఎద్దు కారును అమాంతం ఎత్తిపడేసింది. ఈ క్రమంలో ఎద్దు బలాన్ని చూసి అంతా అవాక్కయ్యారు. వీడియోపై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఆ వీడియోను మీరూ చూడండి..

ఎద్దు బలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతటిదానినైనా ఎత్తి పడేసే శక్తి ఎద్దుది. ఎద్దుకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఇందులో ఒక ఎద్దు తన బలాన్ని చూపించిన విధానం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. మెక్సికోలోని గ్వాడలజారాలో ఈ ఘటన జరిగింది. రోడ్డు పక్కన ఆపి ఉన్న కారుపై ఎద్దు తన ప్రతాపం చూపింది. దీంతో అక్కడున్న జనాలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
కారును బొమ్మలా నెట్టింది
వీడియోలో ఎద్దు కారును ఒక బొమ్మను ఎత్తినంత సులభంగా ముందుకు తోసింది. కారును గోడకు ఢీకొట్టింది. దానితో కారుకు తీవ్రమైన నష్టం జరిగింది. అయినా ఆ ఎద్దు కోపం చల్లారనట్లుంది. కారుపై కొమ్ములతో దాడికి దిగింది. దీంతో కారు మొత్త డ్యామేజీ అయ్యింది. 1 నిమిషం 40 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. చాలామంది ఎద్దు బలాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అయితే ఎద్దు శరీరం నుండి రక్తం కారుతున్నట్లు కనిపించడంతో కొందరు దానిపై సానుభూతి చూపారు.
నెటిజన్ల రియాక్షన్స్
ఒక యూజర్.. “అమ్మో! ఈ వీడియో చూశాక ఎద్దులకు ఎంత బలం ఉంటుందో తెలిసింది” అని కామెంట్ చేశాడు. మరో యూజర్ ఆశ్చర్యం.. “ఎద్దు కారును కాగితంలా ఎత్తిపడేసింది” అని కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఈ వీడియోలో ఎద్దు బలాన్ని చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
Raging bull wrecks someone's parked Car. byu/H1gh_Tr3ason ininterestingasfuck
మరిని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
