Viral Video: అది నూడిల్సా.. నాగుపామా.. ఈ నాన్ వెజ్ గేదెను మీరెప్పుడైనా చూశారా..?
Buffalo Trying To Eat King Cobra: ప్రపంచ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఇందులో కొన్ని జనాలను విపరీతంగా ఆకట్టుకుంటాయి. అలాంటి వాటిలో తాజాగా ఓ గేదె, నాగుపాటు వీడియో చేరింది. ఈ వీడియోలో గేదె, నాగుపాము మధ్య జరిగిన సీన్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది.

Buffalo Trying To Eat King Cobra: సాధారణంగా పాములను చూస్తే మనుషులకే కాదు, అనేక జంతువులు కూడా భయపడతాయి. ముఖ్యంగా అత్యంత విషపూరితమైన నాగుపాము వంటి సర్పాల జోలికి వెళ్లడానికి ఏ జంతువూ సాహసించదు. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియోలో ఒక గేదె, నాగుపామును తినడానికి ప్రయత్నించడం సంచలనం సృష్టించింది.
వీడియోలో ఏముంది?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక గేదెకు సమీపంలో ఒక నాగుపాము కనిపిస్తుంది. ఆ పాము చెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, గేదె దానిపై ఆసక్తి చూపినట్లుగా కనిపిస్తుంది. ఆ గేదె తన నాలుకతో పామును నాకుతూ, దానిని తినడానికి ప్రయత్నించినట్లు వీడియోలో చూడొచ్చు. గేదె పామును తినేందుకు ఎంతో ప్రయత్నించింది. కానీ, పాము చాకచక్యంగా తప్పించుకుంది. ఇలా చెట్టుపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. సాధారణంగా శాకాహారి అయిన గేదె ఇలా ఒక విషపూరిత పామును తినడానికి ప్రయత్నించడం నెటిజన్లను విస్మయానికి గురిచేసింది. @mjunaid8335 అనే ఖాతా నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు లక్షలాది మంది వీక్షించారు.
View this post on Instagram
సోషల్ మీడియాలో చర్చ..
ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో, నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు గేదె ధైర్యానికి ఆశ్చర్యపోతుండగా, మరికొందరు ఇలాంటి ప్రమాదకరమైన చర్యలు చాలా అరుదు అని అభిప్రాయపడుతున్నారు. అలాగే, పాము నుంచి గేదెను కాపాడకుండా ఇలా వీడియో తీయడమేంటని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ఈ వీడియో భయానకంగా ఉంది. ఎందుకంటే నాగుపాము గేదెను కరిస్తే, భారీ ప్రమాదం జరిగి ఉండేది. లక్కీగా అలా జరగలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..