AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Viral Video: ఏం టెక్నిక్‌ గురూ.. డ్రిల్లింగ్‌ మెషిన్‌తో జ్యూస్‌ తయారీ.. వైరలవుతున్న వీడియో.. నెటిజన్లు ఫిదా..

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని p4ulx_ch అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయగా నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. బహుశ ఇలాంటి ఐడియా గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూసుండరు. ఇదేదో వెరైటీగా బాగుందేనంటూ పలువురు వీడియోపై వ్యాఖ్యానించారు. మిక్సర్ ఇలాకూడా పనిచేస్తుందా అంటూ చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏదైనా సరే ప్రయత్నించి విజయం పొందే వారు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో సర్వత్రా ఆకర్షిణీయంగా మారింది.

Watch Viral Video: ఏం టెక్నిక్‌ గురూ.. డ్రిల్లింగ్‌ మెషిన్‌తో జ్యూస్‌ తయారీ.. వైరలవుతున్న వీడియో.. నెటిజన్లు ఫిదా..
Drilling Machine
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2023 | 9:06 PM

Share

మనం ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం.. అందులో కొన్ని ఆసక్తికరమైనవిగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యపోయేలా ఉంటాయి. విభిన్నమైన వీడియోలు నెటిజన్లు కట్టిపడేస్తుంటాయి. ఈ వీడియోలు చాలా వరకు ఎక్కువ మంది వీక్షకుల, లైకులు పొందుతూ మరింత వైరల్‌ అవుతుంటాయి. కానీ కొన్ని వీడియోలు చూసిన తర్వాత అవి మన మదిలోనే మెదులుతుంటాయి. మనల్ని పదే పదే ఆలోచించేలా చేస్తుంటాయి. మనకు కొత్త జ్ఞానాన్ని, ఆలోచనను అందించే విషయాలుగా ఉంటాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఓ వ్యక్తి జ్యూస్ తయారు చేసిన విధానం సర్వత్రా ఆశ్చర్యపోయేలా చేసింది. ఎందుకంటే అతడు మిక్సర్‌ లేకుండానే కేవలం జార్‌ సాయంతో జ్యూస్‌ తయారు చేశాడు. అదేలాగో ఇక్కడ చూద్దాం..

మిక్సి లేకుండానే కేవలం మిక్సీ జార్‌ ఎలా పనిచేస్తుందో మీరు ఎప్పుడైనా చూశారా..? ఇది వింటేనే ఆశ్చర్యంగా ఉంది కాదా..? కానీ, ఇక్కడ మిక్సి లేకుండానే జార్‌లో జ్యూ్‌స్‌ తయారైంది. అదేలాగంటే.. మిక్సికి బదులుగా ఇక్కడో వ్యక్తి డ్రిల్‌ మిషీన్‌ ద్వారా జ్యూస్‌ తయారు చేశాడు. వైరల్ అవుతున్న వీడియోలో కనిపించే ఆ వ్యక్తి ముందుగా మిక్సీ జార్‌లో పళ్ల ముక్కలు వేశాడు. అయితే అక్కడ మిక్సీ లేదు. దీంతో డ్రిల్లింగ్ మెషిన్‌ను మిక్సీ జార్ దిగువ భాగంలో ఇన్‌స్టాల్ చేసి ఆన్ చేశాడు. డ్రిల్లింగ్ మెషిన్ మిక్సీలా పని చేసింది. జ్యూస్ రెడీ అయిపోయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 20 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి

వైరల్‌ అవుతున్న ఈ వీడియోని p4ulx_ch అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేయగా నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. బహుశ ఇలాంటి ఐడియా గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూసుండరు. ఇదేదో వెరైటీగా బాగుందేనంటూ పలువురు వీడియోపై వ్యాఖ్యానించారు. మిక్సర్ ఇలాకూడా పనిచేస్తుందా అంటూ చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యంగా అడుగుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, ఏదైనా సరే ప్రయత్నించి విజయం పొందే వారు చాలా మంది ఉన్నారు. ఈ వీడియో సర్వత్రా ఆకర్షిణీయంగా మారింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..