AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: ప్రమాదకరమైన సముద్ర జీవికి.. భర్తను చంపడానికి ప్రయత్నించిన భార్య పేరు..

సముద్రంలో చిన్న, అందమైన చేపలు మాత్రమే కాదు.. అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలు కూడా దర్శనం ఇస్తాయి. తాజాగా సముద్ర లోతుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక జీవి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ జీవిని 'సముద్రంలోని అత్యంత భయంకరమైన జీవి' అని పిలుస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జీవికి తన భర్తను చంపడానికి ప్రయత్నించిన మహిళ పేరు పెట్టారు.

Viral News: ప్రమాదకరమైన సముద్ర జీవికి.. భర్తను చంపడానికి ప్రయత్నించిన భార్య పేరు..
Bobbit Worms
Surya Kala
|

Updated on: Nov 20, 2023 | 9:12 PM

Share

ప్రకృతిలో అనేక వింతలు విశేషాలున్నాయి. కొన్ని కొన్ని రహస్యాలు వెలుగులోకి వస్తే అవి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి కూడా.. అందుకనే నేల, నింగి, నీరు ఇలా అన్నిటిలోనూ శాస్త్రవేత్తల ఆవిష్కరణలు తరచుగా జరుగుతాయి. ఈ సమయంలో కొన్నిసార్లు శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యపరిచే వింతలు కనిపిస్తూ ఉంటాయి. వాస్తవానికి సముద్ర లోతులో అనేక రకాల జీవులు నివసిస్తున్నాయని నమ్ముతారు. వాటిల్లో అనేక రకాల జీవుల గురించి ఇంకా తెలియదు. సముద్రంలో చిన్న, అందమైన చేపలు మాత్రమే కాదు.. అనేక ఇతర ఆసక్తికరమైన విషయాలు కూడా దర్శనం ఇస్తాయి. తాజాగా సముద్ర లోతుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న ఒక జీవి ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఈ జీవిని ‘సముద్రంలోని అత్యంత భయంకరమైన జీవి’ అని పిలుస్తున్నారు. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ జీవికి తన భర్తను చంపడానికి ప్రయత్నించిన మహిళ పేరు పెట్టారు.

వాస్తవానికి ఒక Reddit వినియోగదారు సముద్రంలో అత్యంత భయానకమైన వస్తువులను షేర్ చేశారు. అయితే ఆ జీవి పేరు అందరికీ షాక్ ఇస్తుంది. LadBible అనే వెబ్‌సైట్ నివేదిక ప్రకారం.. కోపంతో తన భర్త ప్రైవేట్ భాగాన్ని కత్తిరించిన మహిళ పేరుని ఈ జీవికి పేరు పెట్టారు. ఆ మహిళ పేరు లోరెనా బాబిట్. అందుకే ఈ జీవికి బాబిట్ వార్మ్ అనే పేరు పెట్టారు. ఈ జీవిని శాండ్-స్ట్రైకర్ అని కూడా పిలుస్తారు, దీనిని శాస్త్రీయంగా యూనిస్ అఫ్రోడిటోయిస్.

ఇవి కూడా చదవండి

ఈ వింత జీవి ఎలా ఉందంటే.. ఈ భయంకరమైన జీవి పాము, సెంటిపెడ్ ల కలయికలా కనిపిస్తుంది. ఈ జీవి అట్లాంటిక్, ఇండో-పసిఫిక్ మహాసముద్రాల వంటి వెచ్చని సముద్రపు లోతుల్లో కనిపిస్తుంది. ఈ భయంకరమైన ప్రెడేటర్ మూడు మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. అయినప్పటికీ ఈ జీవి ఎరను పట్టుకునే విషయంలో అందరూ ఆశ్చర్యపరిచే విధంగా తన పరిమాణాన్ని పెంచుతుంది. ఎరను శరీరం పెంచి దాచిపెడుతుంది. సముద్ర జీవులను వేటాడేందుకు చేపలకు కనిపించకుండా సముద్రపు ఉపరితలంలో దాక్కుంటుంది. వాటిని వేటాడుతుంది.

ఈ సముద్ర జీవి ఎంత ప్రమాదకరమైనదంటే.. ఈ జీవి కొంత సముద్రపు పాచిలా కనిపిస్తుంది. అయితే ఇది చాలా ప్రమాదకరమైన జీవి. ఇది మనిషిని కాటేస్తే పక్షవాతం వస్తుందని అంటారు. ఈ జీవి ప్రత్యేకత ఏమిటంటే. దీనికి కళ్ళు లేవు. అయినప్పటికీ ఇది తన ఎరను ఖచ్చితంగా చేరుకుంటుంది. అంతేకాదు బాబిట్ వార్మ్ కి సంబంధించిన మరొక అతి పెద్ద లక్షణం ఏమిటంటే అది స్వయంగా పునరుత్పత్తి చేయగలదు. వీటిని ముక్కలుగా కట్ చేసినప్పటికీ తల లేదా తోక వంటి గాయపడిన శరీర భాగాలు ‘పునరుత్పత్తి’ చేయగలవు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
గోవాకు పిలిచి మరీ నాగ్ వార్నింగ్ ఇచ్చారు
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఫోన్లలో వైరస్‌.. OTP అవసరం లేకుండానే మీ ఫోన్లో డబ్బులు మాయం!
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
ఈ రాష్ట్ర ప్రజలు మద్యం తాగడంలో నంబర్‌ 1.. తెలంగాణ ఏ స్థానంలో..
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
సనత్ జయసూర్య వరల్డ్ రికార్డును బద్దలు కొట్టిన సఫారీ ఓపెనర్
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
మోదీ పాలనలో అంబేద్కర్ ఆలోచనల ప్రతిధ్వని
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
సైకిల్‌ కంటే నెమ్మదిగా ప్రయాణించే రైలు..! అయినా ఫుల్లు డిమాండ్..
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
పంటి ఎనామిల్‌ను నాశనం చేస్తున్న అలవాటు.. మానకుంటే కష్టమే!
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
వైభవ్‎ సూర్యవంశీకి పట్టపగలు చుక్కలు చూపెట్టిన హైదరాబాద్ ప్లేయర్
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
ఒంట్లో వేడి పుట్టించే సూపర్ డ్రింక్స్.. చలికాలంలో రోజూ తాగితే
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..
కేవలం వడ్డీతోనే రూ.2లక్షల ఆదాయం.. పోస్టాఫీస్‌లో అదిరే స్కీమ్..