Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

King Cobra Viral Video: వీడేంటి బాబోయ్ ఇలా ఉన్నాడు..! ప్రమాదకర కింగ్‌కోబ్రా తలపై ముద్దు పెట్టాడు..

ఆ వ్యక్తి పామును ముద్దుపెట్టుకోవడం వీడియోలో స్పష్టంగా చాలా దగ్గరగా కనిపించింది. ఈ వీడియో నిజంగా చాలా భయంకరంగా ఉంది. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచిన ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చాలా మంది పాముల పట్ల తమ భయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి విన్యాసాలు చేస్తుండగా, జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకున్నారు. ప్రాణాంతక సరీసృపాలతో అతడు ధైర్యంగా, అంత సులువుగా చేసిన స్టంట్‌ని నెటిజన్లు ప్రశంసించారు.

King Cobra Viral Video: వీడేంటి బాబోయ్ ఇలా ఉన్నాడు..! ప్రమాదకర కింగ్‌కోబ్రా తలపై ముద్దు పెట్టాడు..
King Cobra
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 20, 2023 | 7:20 PM

పాములు అత్యంత ప్రమాదకరమైన జీవులలో ఒకటి అయినప్పటికీ, ఈ సరీసృపాలతో ప్రజలు తరచూ ఏదో ఒక్క స్టంట్‌ చేస్తున్న వీడియోలు తరచూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి..పాము పేరు వింటే చాలు.. కొందరు భయంతో పారిపోతారు. కొందరు వాటితో గేమ్స్‌ ఆడుతుంటారు. అంతేకాదు..మరికొందరు ప్రాణాంతక జీవులను పెంపుడు జంతువులుగా కూడా ఇంట్లో తమతో పాటు పెంచుకుంటుంటారు. పాములతో విన్యాసాలు చేస్తూ.. తమలోని సృజనాత్మకతను బయటపెడుతుంటారు ఇంకొందరు. ఇలాంటి పనే చేశాడు ఇక్కడో వ్యక్తి..ప్రమాదకర కింగ్ కోబ్రాతో గేమ్స్ ఆడుతున్నాడు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి పాముతో ఒక స్టంట్ చేశాడు.. ఎలాంటి భయం, బెరుకు లేకుండా కింగ్ కోబ్రా తలపై ముద్దుపెట్టి.. అందరినీ భయాందోళనకు గురి చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతోంది. ఈ క్లిప్‌ను షేర్ చేసిన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ‘స్నేక్_లవర్_నరసింహ’లో షేర్ చేయబడింది.

ఇవి కూడా చదవండి

ఆ వ్యక్తి పామును ముద్దుపెట్టుకోవడం వీడియోలో స్పష్టంగా చాలా దగ్గరగా కనిపించింది. ఈ వీడియో నిజంగా చాలా భయంకరంగా ఉంది. ఇంటర్నెట్‌ను ఆశ్చర్యపరిచిన ఈ వీడియో షేర్ చేసిన వెంటనే వైరల్‌గా మారింది. చాలా మంది పాముల పట్ల తమ భయాన్ని వ్యక్తం చేశారు. అలాంటి విన్యాసాలు చేస్తుండగా, జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకున్నారు. ప్రాణాంతక సరీసృపాలతో అతడు ధైర్యంగా, అంత సులువుగా చేసిన స్టంట్‌ని నెటిజన్లు ప్రశంసించారు. ఇంటర్‌ నెట్‌ని షాక్‌కు గురిచేసిన ఈ వీడియో ఇప్పటికే168K వీక్షణలను పొందింది. చాలా మంది వీడియోపై స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..