అయ్యో పాపం..ఇదెక్కడి దారుణం..పెళ్లిలో చెప్పుల గొడవతో పెళ్లికొడుకును చితకొట్టారు..
దాచ్చిపెట్టిన చెప్పులు తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వధువు బంధువులు. అంతే ఇక్కడే మొదలైంది రచ్చ..దాంతో వరుడికి చుక్కలు చూపించారు వధువు బంధువులు. ఇరువర్గాల మధ్య మొదలైన వాదన పెద్ద గొడవకు దారితీసింది.. వధువు తరపు వారు తమను ఒక గదిలో బంధించి కొట్టారని వరుడు, అతని బంధువులు చెబుతున్నారు. పరిస్థితి ఎంతగా తీవ్రంగా మారిందంటే పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.

సోషల్ మీడియాలో నిత్యం అనేక పెళ్లి వీడియోలు,వార్తలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వివాహ వేడుకల్లో జరిగే వివాదాలకు సంబంధించిన ఘటనలు కూడా అనేకం ఉంటున్నాయి. ఇది కూడా అలాంటి వార్తే.. ఉత్తరాఖండ్‌కు చెందిన షబీర్ అనే యువకుడికి యూపీలోని బిజ్నోర్ జిల్లాకు చెందిన యువతితో శనివారం నాడు పెళ్లైంది. పెళ్లి తర్వాత ఆచారాల ప్రకారం వధువు కుటుంబ సభ్యులు వరుడి చెప్పులు దాచే ఆచారం జరిగింది. దాచ్చిపెట్టిన చెప్పులు తిరిగి ఇవ్వాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు వధువు బంధువులు. అంతే ఇక్కడే మొదలైంది రచ్చ..దాంతో వరుడికి చుక్కలు చూపించారు వధువు బంధువులు. ఇరువర్గాల మధ్య మొదలైన వాదన పెద్ద గొడవకు దారితీసింది.. వధువు తరపు వారు తమను ఒక గదిలో బంధించి కొట్టారని వరుడు, అతని బంధువులు చెబుతున్నారు. పరిస్థితి ఎంతగా తీవ్రంగా మారిందంటే పరస్పరం కర్రలతో కొట్టుకునే వరకు వెళ్లింది.
అందిన సమాచారం ప్రకారం..ఉత్తరప్రదేశ్‌లోని బిజ్నోర్ జిల్లాలో వధువరుల కుటుంబాల మధ్య చిన్న విషయంలో మొదలైన వివాదం తీవ్ర గొడవకు దారితీసింది. ఎందుకంటే వరుడి చెప్పులు దాచిపెట్టిన వధువు బంధువులు కట్నంగా రూ. 50,000 లు డిమాండ్ చేశారు.. అందుకు బదులుగా ఆ వరుడు రూ. 5,000 మాత్రమే ఇచ్చాడట. దాంతో మండిపోయిన వధువు బంధువులు.. ఆగ్రహంతో ఊగిపోయారు. అతడితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువైపుల బంధువులకు ఘర్షణలు జరిగాయి. ఈ క్రమంలో వరుడిని ఓ గదిలో బంధించి వధువు తరఫు బంధువులు కర్రలతో చితకొట్టారని తెలిసింది. చివరకు పోలీసులు రావడంతో గొడవ సద్దుమణిగింది. ఆ వరుడు ముహమ్మద్ షబీర్‌గా గుర్తించారు.
ఇదిలా ఉంటే…షబీర్ కుటుంబం ఇచ్చిన బంగారం నాణ్యత గురించి తమను ప్రశ్నించిందని వధువు కుటుంబం ఆరోపించింది. ఇది వారికి కోపం తెప్పించిందని, దాంతో పరిస్థితులు దారుణంగా మారాయని అన్నారు.. తరువాత నజీబాబాద్ పోలీసు బృందం రంగంలోకి దిగటంతో పరిస్థితి సద్దుమణిగింది. పోలీసులు ప్రతి ఒక్కరి స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..