Viral News: అలాంటి వాళ్లు నా కూతురు పెళ్లికి రావద్దు.. వధువు తండ్రి కండిషన్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

వివాహం అంటేనే సంబురం. ఎక్కడెక్కడో ఉన్న బంధువులంతా ఒకచోట చేరి ఎంజాయ్‌ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత కలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మందు పార్టీలు చేసుకోవడం కూడా సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మందు పార్టీలు మొదటి మోసం తెస్తుంటాయి...

Viral News: అలాంటి వాళ్లు నా కూతురు పెళ్లికి రావద్దు.. వధువు తండ్రి కండిషన్‌ తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.
Viral News

Updated on: Mar 03, 2023 | 5:25 PM

వివాహం అంటేనే సంబురం. ఎక్కడెక్కడో ఉన్న బంధువులంతా ఒకచోట చేరి ఎంజాయ్‌ చేస్తుంటారు. చాలా కాలం తర్వాత కలిసిన కుటుంబ సభ్యులు, స్నేహితులు మందు పార్టీలు చేసుకోవడం కూడా సహజమే. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మందు పార్టీలు మొదటి మోసం తెస్తుంటాయి. తాగిన వాళ్లు తాగినట్లు ఉంటారా.? ఏదో ఒక గొడవకు దారి తీస్తుంటారు. ఇలాంటి మందు బాబుల కారణంగా సంతోషంగా ఉండాల్సిన పెళ్లింట గొడవలు జరుగుతుంటాయి. ఇలాంటి సంఘటనలు మీరు కూడా ఎప్పుడో ఒకప్పుడ చూసే ఉంటారు.

అయితే తన కూతురి పెళ్లిలో ఇలాంటి ఘటనలకు తావులేకుండా ఉండాలనుకున్నాడు ఓ తండ్రి. ఇందుకోసం ఓ వినూత్న ఆలోచన చేశాడు. ఇంతకీ ఆ తండ్రి చేసిన ఆ ఆలోచన ఏంటో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. గుజరాత్‌ రాష్ట్రం, రాజకోట్ జిల్లా హడలా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన కూతురుకు పెళ్లి నిశ్చయించాడు. అయితే ఇటీవల పెళ్లి వేడుకల్లో బంధువులు, స్నేహితులు మద్యం తాగి ఘర్షణలకు దిగి హంగామా చేస్తున్నారని గుర్తించిన ఆయన.. శుభలేఖల్లోనే ఓ కండిషన్‌ ప్రింట్ చేయించాడు. ‘మందు తాగే వాళ్లు నా కూతురు పెళ్లికి రావద్దు’ అని ప్రింట్ చేయించి బంధువులకు పంచాడు.

దీంతో ఇది చూసిన బంధువులు అవాక్కయ్యారు. అయితే అతను ఈ నిర్ణయం తీసుకోవడానికి బలమైన కారణమే ఉందండోయ్‌.. గుజరాత్‌లో మధ్యపాన నిషేధం ఉన్నా కొన్ని ప్రాంతాల్లో వేడుకల కోసం దొంగచాటుగా మద్యం తెప్పించుకొని తాగుతున్నారు. అంతటితో ఆగకుండా వేడుకల్లో నానా రచ్చ చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన వధువు తండ్రి తన కూతురు పెళ్లిలో అలా జరగకూడదని డిసైడ్‌ అయ్యాడు. అందులో భాగంగానే ఇలా ప్రింట్‌ చేయించి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..