ఇప్పుడంతా డిజిటల్ యుగం.. చెయ్యి.. చెయ్యి కలుపుకుని క్యాష్ ఇవ్వడం కంటే.. అందరూ డబ్బులు ఇచ్చేందుకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి అప్లికేషన్స్ ఉపయోగిస్తున్నారు. అయితే ఈ విధానంలో కొంతమంది ఆన్‌లైన్ ద్వారా డబ్బులు పే చేయకుండా వ్యాపారస్తులను మోసం చేస్తున్నారు కూడా. ఇక అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూశాక మీరు కూడా ఇలా కూడా మోసం చేస్తారా.? అని ఆశ్చర్యపోతారు.
వైరల్ వీడియో ప్రకారం.. ఓ ఇద్దరు వ్యక్తులు షాపులో ఏదో కొనేందుకు వచ్చినట్లుగా మీరు చూడవచ్చు అలాగే అందులోని ఓ వ్యక్తి చేతుల్లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. వారిద్దరూ దుకాణదారుడిని ఓ వస్తువు గురించి అడుగుతారు. ఇక అతడేమో దాన్ని ఇవ్వడానికి ఇంకో వైపుకు తిరుగుతాడు. అంతే.! అదే అదును చూసుకుని ఈ ఇద్దరూ అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను తమ వెంట తీసుకొచ్చిన దానితో మార్చేస్తారు. పాపం.! ఆ దుకాణదారుడు అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ తనదే అనుకుంటాడు.. ఆ షాపులో ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి వాళ్లు పేమెంట్ కూడా చేస్తారు. అది దుకాణదారుడికి చూపిస్తే.. బదులుగా అతడు ఓకే అని కూడా చెబుతాడు. ఇక పని పూర్తయ్యాక వీరిద్దరూ అక్కడ నుంచి తమ క్యూఅర్ కోడ్‌ను తీసుకుని ఉడాయిస్తారు. ఈ విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా, ఈ వీడియోను ‘darshan.m201’ అనే నెటిజన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా.. ఇప్పటివరకు 2.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే 3.5 లక్షల మంది లైక్ కొట్టారు. లేట్ ఎందుకు మీరూ ఓసారి వీడియోపై లుక్కేయండి..