Viral: మొసలిపై స్వారీ.. ఇలా కూడా డ్రైవింగ్ చేస్తారా అంటూ మండిపడుతున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో

|

Jan 20, 2023 | 6:53 PM

ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా ప్రమాదకర గేమ్స్ ఆడుకోవడం మనం చూసే ఉంటాం.. కానీ, నిజ జీవితంలో మాత్రం అలా ఉండదు. ప్రమాదం ఎదురుగా వచ్చినా..? లేకపోతే ప్రమాదమని తెలిసినా మన గుండెలో భయం మొదలవుతుంది. ఒంటి నిండా భయంతో చెమటలు పడతాయి.

Viral: మొసలిపై స్వారీ.. ఇలా కూడా డ్రైవింగ్ చేస్తారా అంటూ మండిపడుతున్న నెటిజన్లు.. షాకింగ్ వీడియో
Crocodile
Follow us on

సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వింతగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి. తాజాగా.. బైక్‌పై మొసలి.. దానిపై ఓ వ్యక్తి కూర్చొని వెళ్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. సాధారణంగా.. ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా ప్రమాదకర గేమ్స్ ఆడుకోవడం మనం చూసే ఉంటాం.. కానీ, నిజ జీవితంలో మాత్రం అలా ఉండదు. ప్రమాదం ఎదురుగా వచ్చినా..? లేకపోతే ప్రమాదమని తెలిసినా మన గుండెలో భయం మొదలవుతుంది. ఒంటి నిండా భయంతో చెమటలు పడతాయి. అయితే, భూమిపై కొన్ని ప్రమాదకరమైన జీవులు ఉన్నాయి. వాటిని చూసి ప్రజలు దూరంగా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. సింహం, చిరుత, ఏనుగు, పాము వంటి ప్రాణులను చూసి ప్రజలు వణికిపోతారు. కానీ మీరు ఎప్పుడైనా మొసలిని దగ్గరగా చూశారా? మీరు చూసినట్లయితే.. మీరు దానిని ఎప్పుడైనా ముట్టుకున్నారు..? ఇలాంటివి అస్సలూ చేయరు. ఎందుకంటే మొసలి ప్రమాదకర జీవి. అయితే, ఓ వ్యక్తి మాత్రం దానికి భిన్నంగా.. ఎలాంటి భయం లేకుండా మొసలిని బైక్ పైన తాడుతో కట్టి.. దాని పైన కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ ప్రమాదకర వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.

మొసలి మీద సవారీ..

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియో సంచలనంగా మారింది. నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ యువకుడు ఎలాంటి భయం లేకుండా బైక్ పై మొసలితో రోడ్డుపై వెళ్తున్న దృశ్యాన్ని మీరు చూడవచ్చు. అతను తన బైక్‌పై భయంకరమైన మొసలిని తాడుతో కట్టివేసాడు. ఆ తర్వాత మొసలిపై కూర్చొని రోడ్డుపై డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ సందర్భంలో వెనుక నుంచి వస్తున్న వారు మొబైల్ ద్వారా రికార్డ్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

యువకుడు బైక్‌పై మొసలిని ఎందుకు తీసుకెళ్తున్నాడు అనే విషయం మాత్రం తెలియరాలేదు. దీన్ని oy._.starrr అనే పేజ్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా, ఇప్పటి వరకు లక్షా 41 వేల మంది లైక్ చేశారు. లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. ఇది క్రూరత్వం.. జంతువులతో ఇలాగేనా వ్యవహరించేది అంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

కాగా, జంతువులను హింసించడం, వాటితో ఆడుకోవడం చట్టరీత్యా నేరం.. జంతువులతో ఇలా వ్యవహరిస్తే జరిమానాతోపాటు.. జైలు శిక్ష కూడా పడుతుంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..