Funny Video: ఈ బుడ్డోడు డ్యాన్స్‌కు ఫిదా కావాల్సిందే.. స్టెప్పులతో ఇరగదీశాడు.. వైరల్ వీడియో..
Boy Dancing Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఇటీవల కాలంలో చాలా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలు కొన్ని నెటిజన్లను నవ్విస్తుంటే.. మరికొన్ని
Boy Dancing Video: సోషల్ మీడియా ప్రపంచంలో ఇటీవల కాలంలో చాలా వీడియోలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలు కొన్ని నెటిజన్లను నవ్విస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తుంటాయి. ఇంకొన్ని భయభ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇలాంటి వాటిల్లో కొన్ని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. అలాంటివి చూడటం వలన మనకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఇలాంటి వీడియోల్లో డ్యాన్స్‌కు సంబంధించినవి నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ఎవ్వరూ చేయలేని విధంగా డ్యాన్స్ చేస్తూ కొంతమంది ఆకట్టుకుంటుంటారు. తాజాగా.. ఓ బుడ్డోడి డ్యాన్స్ వీడియో కూడా తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన వారంతా వావ్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక చిన్న పిల్లవాడు ఫన్నీగా డ్యాన్స్ చేస్తుంటారు. అతని డ్యాన్స్ స్టైల్‌ను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఒక చిన్న పిల్లవాడు ఈ రకంగా డ్యాన్స్ చేయగలడా.. అది కూడా మెలికలు తిరుగుతూ స్టెప్పులేయగలడా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. బుడ్డోడి నృత్య విధానం అద్భుతంగా ఉందంటూ కామెట్లు చేస్తున్నారు.
Twitter right now pic.twitter.com/NiANFCk538
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) July 8, 2021
ఈ పిల్లవాడు డ్యాన్స్ చేస్తున్నప్పుడు చుట్టూ మరికొంతమంది పిల్లలు కూడా ఉన్నారు. వారంతా పాఠశాల యూనిఫాం ధరించి.. కనిపిస్తున్నారు. అయితే.. డ్యాన్స్ బాయ్ మాత్రం చాలా సింపుల్‌గా కనిపిస్తున్నాడు. అతను సాధారణ బట్టలు ధరించినప్పటికీ.. అసాధారణంగా నృత్యం చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. కాగా.. ఈ వీడియో పాతదే అయినప్పటికీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.
Also Read: