AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏందక్కాయ్ నువ్వు.. ప్రయాణికురాలిగా వచ్చి ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..

బస్సులో ప్రయాణికురాలిగా ఎక్కిన ఒక మహిళ.. ఏకంగా కండక్టర్ టికెట్, నగదు బ్యాగ్‌నే దొంగిలించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. బస్సులో రద్దీగా ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఆమె చాకచకర్యంగా ఈ దొంగతనానికి పాల్పడింది. అయితే తన బ్యాగ్ మాయమవడాన్ని గమనించిన కండక్టర్ సమయస్ఫూర్తితో బస్సు తలుపులు మూయించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి ప్రయాణికుల సామాన్లను తనిఖీ చేయగా సదరు మహిళ బ్యాగులో కండక్టర్ లగేజీ బ్యాగ్ దొరికింది. ఆ తర్వాత ఏం జరిగిందో పూర్తి డిటెల్స్ లోకి వెళ్లాల్సిందే..

ఏందక్కాయ్ నువ్వు.. ప్రయాణికురాలిగా వచ్చి ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
Conductor Cash Bag Theft
Jyothi Gadda
|

Updated on: Jul 15, 2026 | 6:21 PM

Share

సాధారణంగా బస్సుల్లో ప్రయాణికుల జేబులు కత్తిరించే జేబుదొంగల గురించి లేదా బంగారం, బ్యాగులు ఎత్తుకెళ్లే దొంగల గురించి మనం వినే ఉంటాం. కానీ, బెంగళూరులో ఒక కిలేడీ ఏకంగా బస్సు కండక్టర్ డ్యూటీ బ్యాగ్‌నే కొట్టేసి షాక్‌కు గురిచేసింది. ప్రయాణికురాలి సముదాయంలో కలిసిపోయి అత్యంత చాకచక్యంగా ఆమె చేసిన ఈ దొంగతనం వ్యవహారం బెంగళూరు నగరంలో తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే?..

బెంగళూరు నగరంలో ప్రయాణికులతో వెళ్తున్న KA-57 F 6331 నంబర్ గల బీఎంటీసీ బస్సులో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఒక మహిళ, కండక్టర్ టికెట్లు, నగదు ఉంచే అఫీషియల్ డ్యూటీ బ్యాగ్‌ను ఎవరికీ తెలియకుండా దొంగిలించింది. ఆ తర్వాత ఆ బ్యాగ్‌ను తాను తెచ్చుకున్న సంచిలో దాచేసి, ఏమీ తెలియనట్లు బస్సు దిగి జారుకోవడానికి ప్రయత్నించింది.

ఇవి కూడా చదవండి

కొద్దిసేపటికే తన టికెట్, క్యాష్ బ్యాగ్ కనిపించకపోవడాన్ని కండక్టర్ గమనించాడు. బ్యాగ్ దొరకకపోతే తనకు సస్పెన్షన్ తప్పదని తీవ్ర ఆందోళనకు గురైన కండక్టర్.. వెంటనే సమయస్ఫూర్తితో వ్యవహరించి డ్రైవర్‌తో బస్సు తలుపులన్నీ మూయించేశాడు. బస్సును మధ్యలోనే నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో బస్సు దిగడానికి వీల్లేకుండా తలుపులు మూసివేయడంతో సదరు దొంగిలించిన మహిళ కంగారుపడింది. డోర్ ఓపెన్ చేయాలంటూ డ్రైవర్, కండక్టర్లతో గొడవకు దిగి హైడ్రామా సృష్టించింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బస్సు వద్దకు చేరుకుని ప్రయాణికుల బ్యాగులను, సామాన్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడం ప్రారంభించారు. కొందరు ప్రయాణికులు సదరు మహిళపై అనుమానం వ్యక్తంచేయడంతో పోలీసులు ఆమె బ్యాగ్‌ను సోదా చేశారు. అందులో దొంగిలించబడిన కండక్టర్ టికెట్ బ్యాగ్ లభ్యమైంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ దొంగతనం ఉదంతాన్ని బస్సులోని కొందరు ప్రయాణికులు, కండక్టర్ తమ మొబైల్ ఫోన్లలో రికార్డు చేశారు. నిందితురాలు తమిళనాడు మూలాలకు చెందిన మహిళగా పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, ప్రయాణికుల వాంగ్మూలాలు సేకరిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఏపీ ఈఏపీ-సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. వెబ్ ఆప్షన్లు ఎప్పటి
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
ఓటీటీలోకి మలయాళం సూపర్ హిట్ .. తెలుగులోనూ చూడొచ్చు
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
రోజుకు 3GB డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌..వ్యాలిడిటీ ఎంతంటే
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
ఏందక్కాయ్ నువ్వు..ఏకంగా కండక్టర్ బ్యాగుకే ఎసరు పెట్టావ్..
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్ "రైలు పలహారం"
పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పాతకాలపు సాంప్రదాయ టిఫిన్
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
దేశ అణు రక్షణపై సైబర్ అటాక్! కీలక పత్రాలు లీక్!
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఒక్క నిర్ణయంతో ఆ దేశంలో పొగరాయుళ్ల ఆటకట్టించిన సర్కార్..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అక్షర్ పటేల్ సరికొత్త రికార్డు
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం
వీటి ముందు మిల్లెట్స్ కూడా జుజుబీ.. ఇది బంగారంతో సమానం
ముత్యం ధరించాలనుకుంటున్నారా? ఏ రాశులకు శుభం.. ఎవరు ధరించకూడదు?
ముత్యం ధరించాలనుకుంటున్నారా? ఏ రాశులకు శుభం.. ఎవరు ధరించకూడదు?