AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snake Video: రైతు పొలం గెట్టు తవ్వుతుండగా ఉద్భవించిన నీలం రంగు నాగు..

పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో మనకు తారసపడుతూనే ఉంటాయి. అందునా నాగుపాము వీడియోలకు రీచ్ ఎక్కువగా ఉంటుంది. నాగుపాములు మనకు తెలుగు రాష్ట్రాల్లో నిత్యం మనకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే నీలం రంగు నాగుపామును మీరెప్పుడైనా చూశారా..? ఇదిగో వీడియో...

Snake Video: రైతు పొలం గెట్టు తవ్వుతుండగా ఉద్భవించిన నీలం రంగు నాగు..
Cobra
Ram Naramaneni
|

Updated on: Oct 21, 2025 | 10:07 AM

Share

పొలాల్లో పనిచేస్తున్న రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో తిరిగే వారు తరచుగా పాములను చూసే అవకాశం ఉంటుంది. సాధారణంగా పాములు అడవులు, పొలాలు, గడ్డివాములు, పొదలు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో కనిపిస్తాయి. చాలా మంది పామును చూసిన క్షణం భయంతో వెనక్కి తగ్గిపోతారు. కానీ కొంతమంది మాత్రం భయపడకుండా పాముల దగ్గరికి వెళ్లి వాటితో రిస్కీ స్టంట్లు చేస్తుంటారు. ఈ రకమైన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇటీవల అలా వైరల్ అయిన ఒక వీడియోలో ఓ రైతు తన పొలంలో పనులు చేస్తుండగా ఆకస్మాత్తుగా ఒక నీలం రంగు నాగు పాము నేల నుంచి బయటకు వచ్చింది. అది బుసలు కొడుతూ తలెత్తి నిలబడ్డ విధానం రైతును షాక్‌కు గురిచేసింది. భయంతో అతను వెనక్కి తగ్గి పామును అక్కడి నుంచి తరిమేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ నీలి పాము పడగ విప్పి కదలకుండా కొంతసేపు అక్కడే నిలబడి ఉంది. తర్వాత మెల్లగా చెట్ల వైపు చేరి కనిపించకుండా పోయింది.

ఈ రకమైన నీలం పాములు చాలా అరుదుగా బయటకు వస్తాయని స్నేక్ క్యాచర్స్ చెబుతున్నారు. వర్షాకాలం ముగిసిన తర్వాత లేదా వాతావరణ మార్పుల సమయంలో ఇవి బైటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. రైతులు, గ్రామీణులు ఇలాంటి పాములను చూసినప్పుడు దూరంగా ఉండి, వాటిని చంపకుండా.. అటవీ సిబ్బందికి సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఆ నీలం పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఆ పామును చూసి ఆశ్చర్యపోతూ.. ‘ఇంత అందమైన పాము నిజంగా ఉందా?.. లేక ఇది ఏఐ వీడియోనా’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో ఫిల్డర్ వాడి పాము కలర్ మార్చారని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి 

బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
12 సినిమాలు.. 2 హిట్స్.. ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?