Viral News: ఆహా.. పతి అంటే ఇతనే కదా.. భార్య కోసం కోట్ల జీతం.. అద్భుతమైన ఉద్యోగం వదులుకున్నాడు

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఒక వ్యక్తి చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. దీనిలో అతను తన గర్భవతి అయిన భార్యకు సహాయం చేయడానికి కోటి రూపాయల కంటే ఎక్కువ జీతం ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టానని పేర్కొన్నాడు. ఆ వ్యక్తి తన ఉద్యోగాన్ని వదిలి ఒక సంవత్సరం విరామం తీసుకుని ఇంటి పనుల్లో భార్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు.

Viral News: ఆహా.. పతి అంటే ఇతనే కదా.. భార్య కోసం కోట్ల జీతం.. అద్భుతమైన ఉద్యోగం వదులుకున్నాడు
Bengaluru Man Leaves His Job

Updated on: Aug 13, 2025 | 5:13 PM

లక్షలాది కోట్ల జీతం, సౌకర్యాలు ఉన్న ఉద్యోగం ఉంటే ప్రశాంతంగా జీవించాలని అందరూ కోరుకుంటారు. ఈ కోరిక అందికీ తీరదు. అయితే తమకు వచ్చిన ఉద్యోగంతోనే జీవితాన్ని గడుపుతారు. అందుకనే ప్రస్తుతం జీవితానికి ఒక భరోసా ఉద్యోగం ఇస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక వ్యక్తి తాను చేస్తున్న ఉద్యోగం వదిలి వార్తల్లో నిలుస్తున్నాడు. తన భార్యను చూసుకోవడానికి, ఆమెకు పనిలో సహాయం చేయడానికి కోటి రూపాయలకు పైగా జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. ఇలాంటి వ్యక్తుల గురించి అరుదుగా వింటారు. ఈ ఘటన బెంగళూరుకి చెందినది అని తెలుస్తోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఒక పోస్ట్ వైరల్ అయింది. అందులో ఆ వ్యక్తి ‘నేను రూ. 1 కోటి కంటే ఎక్కువ విలువైన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను’ అని రాశారు. తన పోస్ట్‌లో ఇంత పెద్ద అడుగు వేయడానికి గల కారణాన్ని కూడా వివరించాడు. తాను కాలేజీ డ్రాపౌట్ అని.. కానీ గత 7 సంవత్సరాలలో చాలా పురోగతి సాధించానని చెప్పాడు. కేవలం రెండు నెలల క్రితం తన ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడని తనకు తన భార్యకు తెలిసిందని చెప్పాడు. అప్పుడే తాను ఉద్యోగాన్ని వదిలి ఒక సంవత్సరం పాటు విరామం తీసుకుని ఇంటి పనుల్లో తన భార్యకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. అయితే, తన భార్య మాత్రం ఉద్యోగానికి రిజైన్ చేయడానికి నిరాకరించింది.. ఇంటి నుంచే వర్క్ చేయాలని నిర్ణయించుకుందని తెలిపాడు.

ఇంట్లో పనిని బాధ్యతలను ఇప్పటికే ఇద్దరూ విభజించుకున్నామని చెప్పాడు. మంచి ఉద్యోగాన్ని విడిచి పెట్టే ధైర్యం తనకు ఉందని.. తనకున్న సంబంధాలు, అనుభవం కారణంగా తాను ఎప్పుడైనా తాను తిరిగి ఉద్యోగంలో చేరగలనని తనకు తెలుసు.. ఆ నమ్మకం ఉంది కనుకనే ఉద్యోగానికి రిజైన్ చేశానని చెప్పారు. తాను చాలా అదృష్టవంతుడిని చెప్పాడు. తనకు సంవత్సరానికి రూ. 1.2 కోట్లు జీతం వస్తుందని కూడా పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి

జీవితంలో సరైన సమయంలో సరైన స్థలానికి చేరుకోవడం చాలా ముఖ్యమైనదని నేను భావిస్తున్నాను. మీ భాగస్వామికి మీరు అవసరమైనప్పుడు, మీ పిల్లలకు మీరు అవసరమైనప్పుడు, మీ తల్లిదండ్రులకు మీరు అవసరమైనప్పుడు. మిగతావన్నీ తరువాత అనిపిస్తాయి. నిజం చెప్పాలంటే, మంచి జీతం వచ్చే ఉద్యోగం పొందడం చాలా తేలికైన పని.. కానీ జీవితంలో ఈ ప్రత్యేక క్షణాలను కోల్పోవడం సరైనది కాదని అన్నాడు.

ఆ వైరల్ పోస్ట్ ని ఇక్కడ చూడండి

ఈ పోస్ట్ ఆన్‌లైన్‌లో షేర్ చేయగానే వైరల్‌గా మారింది. ప్రజలు స్పందించడం ప్రారంభించారు. చాలా మంది ఆ వ్యక్తికి అనుకూలంగా మాట్లాడారు. అతని సాహసోపేతమైన చర్యను ప్రోత్సహించారు, మరికొందరు ఇది లైక్‌లు పొందడానికి ఒక మార్గం అని అన్నారు. అదే సమయంలో ఒకరు ‘అందరి కథ ఒకేలా ఉండదు, చాలా మంది ఉద్యోగాన్నిపోగొట్టుకోవడాన్ని భరించలేరు.. మీరు అదృష్టవంతులు’ అని వ్యాఖ్యానించగా, మరొకరు ‘నాకు కూడా ఇంత మంచి ఉద్యోగం ఉంటే నేను కెరీర్ బ్రేక్ తీసుకోగలను’ అని వ్యాఖ్యానించారు. ఒకరు ‘కాలేజీ డిగ్రీ లేకుండా మీకు ఉద్యోగం ఎలా వచ్చింది?’ అని అడిగారు.

 

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..