AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సమ్మర్ టెక్నలాజియా.. ఎంత సల్లగుందో.. ఎండ దెబ్బకు తట్టుకోవాలంటే మీరు ఇలా చేయండి!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా తెలుగురాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో 48 డిగ్రీలు ఉష్ణోగ్రతలు మోదవుతున్నాయి. ఈ భానుడి భగభగలకు తోడు వీచే వడగాలులు జనాలను ఉక్కిరికి బిక్కిరి చేస్తున్నాయి. అయితే ఈ మండే ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ఓ వ్యక్తి వినూత్న ఆలోచన చేశాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: సమ్మర్ టెక్నలాజియా.. ఎంత సల్లగుందో.. ఎండ దెబ్బకు తట్టుకోవాలంటే మీరు ఇలా చేయండి!
Telangana Heatwave Viral Social Media Video
Anand T
|

Updated on: May 24, 2026 | 8:01 AM

Share

తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతకు ప్రజలు ఉక్కిరికి బిక్కిరి అవుతున్నాయి.ఈ ఎండ వేడి కారణంగా అడుగు బయటపెట్టాలంటేనే భయపడిపోతున్నారు. ఈ తీవ్రమైన పరిస్థితుల్లో సామాన్యుడు తట్టుకుని నిలబడడమే ఒక పెద్ద సాహసంగా మారింది. బయటకు వెళ్లి పనులు చేసుకునేవారు ఈ ఎండల వల్లీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భరించలేని వేడి నుండి, సూర్యుని నిప్పుల చురకల నుండి తనను తాను కాపాడుకోవడానికి ఒక వ్యక్తి వినూత్నంగా ఆలోచించాడు. తన తలపై తాజా కానుగు ఆకులను ఒక కిరీటంలా పెట్టుకుని బైక్‌ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వైరల్‌ వీడియో ప్రకారం.. మండే ఎండలను తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి.. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు వినూత్నంగా ఆలోచించాడు. తలపై కానుగ ఆకులను కట్టుకొని బైక్‌పై ప్రయాణం మొదలు పెట్టాడు. అయితే అతను బైక్‌పై వెళ్తుండగా చూసిన కొందరు స్థానికులు ఈ వింత దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. అయితే మొదట చూడగానే ఈ దృశ్యం కాస్త వింతగా, నవ్వు తెప్పించేదిగా అనిపించినప్పటికీ.. దీని వెనుక ఉన్న కఠోర వాస్తవికత ప్రతి ఒక్కరినీ కలచివేస్తోంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి సామాన్య ప్రజలు తమదైన శైలిలో వెతుక్కుంటున్న తాత్కాలిక, సాంప్రదాయ మార్గాలకు ఇది ఒక నిదర్శనంగా నిలుస్తోంది.

అయితే ఈ వీడియో సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేసిన వ్యక్తి ఇలా రాసుకోచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతుండడంతో, నిత్యం రోడ్లపై తిరిగే సమాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారిందని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసే వారికి, నగరాల్లో ఫుడ్‌ డెలివరీ చేసే గిగ్‌ వర్కర్లకు ఈ వడగాలులు నరకాన్ని చూపిస్తున్నాయని.. అయితే ఈ వేడి గాలుల మధ్య, కనుగు ఆకుల నుండి లభించే కొద్దిపాటి సహజ చల్లదనం కూడా ఆ సామాన్యుడికి కొండంత ఉపశమనాన్ని ఇస్తోందని ఆయన రాసుకొచ్చాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us