Watch: అర్ధరాత్రి గేటు మీద ఏదో వింత ఆకారం.. నేరుగా ఇంట్లోకి చొరబడింది..!
అర్ధరాత్రి ఆ ఇంటి గేటు వద్ద ఏదో అలజడి మొదలైంది.. ఏదో గుర్తు తెలియని వింత ఆకారం గేటు మీదుగా లోపలి వచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం ఇంటికి వెనుక వైపు వెళ్లింది. ఈ ఘటన ఈనెల 23న తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంటి దగ్గరే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అటవీ సమీప ప్రాంతాల్లోకి జంతువులు చొరబడడం సర్వసాధారణంగా జరుగుతుంటుంది. అలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుగుబంట్లు చొరబడిన సందర్భాల్లో కొన్నిసార్లు ప్రాణనష్టం కూడా జరుగుతుంటుంది. అయితే అప్పుడప్పుడూ ఇలాంటి సమయాల్లో కూడా ఆశ్చర్యకర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
వైరల్ వీడియో హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో జరిగినట్టుగా తెలుస్తోంది. ఓ ఇంట్లోకి ఎలుగుబంటి చొరబడింది. సైలెంట్‌గా వచ్చిన ఎలుగుబంటి కాసేపు ఇంట్లో అటు ఇటు తిరిగింది. అనంతరం ఇంటికి వెనుక వైపు వెళ్లింది. ఈ ఘటన ఈనెల 23న తెల్లవారుజామున 3 గంటల సమయంలో జరిగింది. అయితే ఈ దృశ్యాలన్నీ ఇంటి దగ్గరే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




