Viral Video: కారులో నుంచి వింత శబ్దాలు.. భయపడుతూనే దగ్గరకు వెళ్లి చూడగా ఊహించని షాక్.!
అదొక ఫామ్ హౌస్. కుటుంబమంతా కూడా తమ వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చారు. తమతో పాటు తీసుకొచ్చిన సామాన్లను..

అదొక ఫామ్ హౌస్. కుటుంబమంతా కూడా తమ వీకెండ్‌ను ఎంజాయ్ చేయడానికి అక్కడికి వచ్చారు. తమతో పాటు తీసుకొచ్చిన సామాన్లను ఒక్కొక్కటిగా లోపల పెడుతున్నారు. అయితే వారికి ఇంతలో అనూహ్య పరిణామం ఎదురైంది. సామాన్లు ఒక దగ్గర నుంచి వేరొక చోటకు మార్చే క్రమంలో కారులో నుంచి వింత శబ్దాలు రావడం గమనించారు. అవి ఏంటా అని దగ్గరకు వెళ్లి చూడగా ఒక్కసారిగా ఖంగుతిన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది.? ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఓ ఇద్దరు వ్యక్తులు తమ కారు డోర్‌ను నెమ్మదిగా తెరుస్తూ.. లోపల ఏదో ఉందని గమనించి పరుగులు పెడుతున్నట్లు మీరు వీడియోలో చూడవచ్చు. వారు ఆ కారులో అసలు ఏముంది.? ఆ శబ్దాలు ఎందుకు వస్తున్నాయి అని తెలుసుకోవడానికి నెమ్మదిగా ఫ్రంట్ డోర్ తెరిచారు. అంతే ఒక్కసారిగా ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే.! కారులో ఓ ఎలుగుబంటి దూరింది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమోననుకుని కారు మొత్తాన్ని చెల్లాచెదురు చేసింది. అంతేకాకుండా ఆ ఇద్దరి వ్యక్తులను భయపెడుతూ డోర్ అద్దాన్ని బద్దలు కొట్టి మరీ బయటికి వచ్చింది. ఇక ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
View this post on Instagram
కాగా, ఈ వీడియోను ‘nature27_12’ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ అప్‌లోడ్ చేయగా.. క్షణాల్లో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా 2.38 లక్షల వ్యూస్ దక్కించుకుంది. దీనిని చూసిన నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్, లైకులతో హోరెత్తిస్తున్నారు.