Viral Video: ప్రాణం కోసం మొసలితో గున్న ఏనుగు పోరాటం.. బిడ్డ కోసం తల్లి ఏనుగు ఆరాటం.. చివరకు..
ఆ వీడియోలో ఓ ఏనుగుల గుంపు ఓ సరస్సులో నీళ్లు తాగుతుంది. అయితే ఆకస్మాత్తుగా ఓ పెద్ద మొసలి ఏనుగులపై దాడి చేసింది.
పిల్లలపై తల్లి ప్రేమ అనంతం. అమ్మ ప్రేమను మాటల్లో వర్ణించలేము. పిల్లలకు చిన్న గాయమైన అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. అదే వారి ప్రాణాలకు ఆపద వస్తే.. తన ప్రాణాన్ని ఫణంగా పెడుతుంది. బిడ్డ కోసం తల్లి పడే ఆరాటం అంతులేనిది. కేవలం మనషులు మాత్రమే కాదు. జంతువులు సైతం తమ పిల్లల పట్ల చూపే ప్రేమకు అనిర్వచనియం. ప్రస్తుతం అమ్మకు ప్రేమకు నిదర్శనమైన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు తన ట్విట్టర్ వేదికలో షేర్ చేసిన వీడియోలో తల్లి ఏనుగు తన బిడ్డను కాపాడుకునేందుకు ఏకంగా మొసలితో పోరాటం చేసింది.
ఆ వీడియోలో ఓ ఏనుగుల గుంపు ఓ సరస్సులో నీళ్లు తాగుతుంది. అయితే ఆకస్మాత్తుగా ఓ పెద్ద మొసలి ఏనుగులపై దాడి చేసింది. ఓ గున్న ఏనుగు తొండంను పట్టేసింది. దీంతో ఒక్కసారిగా ఏనుగులు వెనక్కు పరిగెత్తగా … మొసలి నుంచి తప్పించుకునేందుకు గున్న ఏనుగు తెగ ట్రై చేసింది. చివరకు తల్లి ఏనుగు మొసలి పై దాడి చేసి తన బిడ్డను వదిలిపెట్టేలా చేసింది. మొసలిని నీళ్లలోకి తొక్కేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోకు విశేషమైన స్పందన వస్తుంది. బిడ్డ కోసం తల్లి ఏనుగు సాహాసం.. ఇన్‌క్రెడిబుల్ సేవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ట్వీట్..
Mother elephant rescues baby elephant from the jaws of a crocodile. Elephants are Just Incredible ?
Credits – in the Video pic.twitter.com/Hf20e5WKau
— Supriya Sahu IAS (@supriyasahuias) July 30, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.