Viral video : స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన ఉదాహరణ.. పిల్ల ఏనుగును కాపాడుకోవడం కోసం ఆ ఏనుగులు ఏంచేశాయో తెలుసా..
సోషల్ మీడియా చేతికొచ్చాకా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన అది క్షణాల్లో ప్రపంచమంతా తిరిగేస్తుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన..

Viral video : సోషల్ మీడియా చేతికొచ్చాకా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏ చిన్న విషయం జరిగిన అది క్షణాల్లో ప్రపంచమంతా తిరిగేస్తుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. ఎవరో ఒకరు జంతువుల వీడియోలు షేర్ చేస్తూనే ఉంటారు. తాజాగా ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాదు.. మనసులకు హత్తుకుంటుంది కూడా. పిల్లలపైనా తల్లిదండ్రులు చూపే ప్రేమ అనిర్వచనీయం. అమ్మ ప్రేమ.. నాన్న పెంపకం పిల్లలకు ఎప్పుడూ శ్రీరామ రక్షే.. పిల్లలకు చిన్న ప్రమాదం జరిగిన తల్లిదండ్రుల ప్రాణం విలవిలాడిపోతుంది. పిలాల్ను కాపాడుకోవడనికి ఎంతటి ప్రమాదనైనా ఎదురుకుంటారు. ఇక్కడ కనిపిస్తున్న ఏనుగులు కూడా అదే చేశాయి. ప్రమాదంలో చిక్కుకున్న పిల్ల ఏనుగును కాపాడుకోవడానికి ఈ రెండు ఏనుగులు ఏం చేశాయో చూడండి.
ఒక జూలోని నీటి గుంటలో నీరు త్రాగేదుకు ఓ తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగుని తీసుకుకొని వెళ్ళింది. ఇంతలో ఆ చిన్న ఏనుగు పిల్ల కాలు జారి ఆ నీటి గుంటలో పడిపోయింది. పాపం ఈత రాక ఆ చిన ఏనుగు విలవిలాడింది. వెంటనే ఆతల్లి ఏనుగు పిల్లను బయకు లాగేందుకు ప్రయతించింది. అయితే పిల్లను బయటకు తీయడం దానివల్ల కాలేదు. ఇంతలో అక్కడికి మగ ఏనుగు వచ్చింది. ఆ రెండు ఏనుగులు పిల్లను కాపాడుకోవడంకోసం పరుగు పరుగున ఆ నీటి గుంటలోకి దిగి నెమ్మదిగా తమ పిల్లను జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చాయి. ఇప్పుడు ఈ వీడియ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. పిల్ల ఏనుగును కాపాడటం కోసం ఆ రెండు ఏనుగుల తాపత్రయం నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియో కు లక్షల్లో లైకులు లభిస్తున్నాయి. మనసులను తాకుతున్న ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి..
This is truly amazing ❤️ pic.twitter.com/lwCAsgBRbW
— ❤️ A page to make you smile ❤️ (@hopkinsBRFC21) September 7, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :