ఒక శిశువు నాలుగు కాళ్ళు, నాలుగు చేతులతో జన్మించాడు. తల్లి గర్భం దాల్చిన అప్పటినుంచి ప్రతి నెలా క్రమం తప్పకుండా ఆస్పత్రికి వెళుతూనే ఉంది. అయితే 9 నెలలు నిండిన తర్వాత స్కానింగ్ చేసిన డాక్టర్లు కంగుతిన్నారు. మహిళ కడుపులోని బిడ్డ పరిస్థితి చూసి అర్థంకాని స్థితిలో పడ్డారు. ఆమె కవలలు పుట్టడం ఖాయమని చెప్పారు. వారిలో ఒక బిడ్డ శరీరం సరిగ్గా అభివృద్ధి చెందలేదని చెప్పారు. అనుకున్న సమయానికి ప్రసవం కోసం ఆమె దావకానలో చేరింది. నార్మల్ డెలీవరి సాధ్యం కాకపోవడంతో వైద్యులు సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. పుట్టిన బిడ్డను చూసి డాక్లర్లు కూడా షాక్ అయ్యారు.
పుట్టిన బిడ్డ నాలుగు చేతులు, నాలుగు కాళ్లను కలిగి ఉంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్‌లో చోటు చేసుకుంది. వింత ఆకారంలో పుట్టిన చిన్నారిని చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. చిన్నారిని చూసేందుకు ఆస్పత్రిలో జనం గుమిగూడారు. ప్రతి ఒక్కరూ బిడ్డను చూడాలని ఎగబడ్డారు. చూసినవారంతా ఇదెక్కడి విచిత్రం అనుకుంటూ ముక్కున వెలేసుకున్నారు. హర్దోయ్‌లోని షహబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో గత వారం పాప జన్మించింది. పుట్టినప్పుడు పిల్లల బరువు సుమారు 3 కిలోలు. జులై 2న, చిన్నారి తల్లి కరీనాకు ప్రసవ నొప్పులు రావడంతో ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. జూలై 2న ఆమె బిడ్డకు జన్మనిచ్చింది. చిన్నారిని చికిత్స నిమిత్తం షహబాద్ నుంచి హర్దోయికి, ఆపై లక్నోకు పంపించారు.
వైద్యాధికారి డా.రమేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. ఇది కవలల కేసు అని, మరో చిన్నారి పొత్తికడుపుపైన ఉన్నట్టు కనిపిస్తున్నా అది పూర్తిగా ఎదగలేదని తెలిపారు. అలాంటి ఉదంతం ఈ ఏడాది మొదట్లో కూడా తెరపైకి వచ్చింది. జనవరి 17న బీహార్‌లోని కతిహార్‌లో 4 చేతులు, 4 కాళ్లతో ఓ చిన్నారి జన్మించింది. అదే సమయంలో, డిసెంబర్ 2021 లో గోపాల్‌గంజ్‌లో మూడు చేతులు, మూడు కాళ్ళతో ఒక బిడ్డ జన్మించాడు. బైకుంత్‌పూర్‌లోని రేవతిత్‌లో నివాసం ఉంటున్న మహ్మద్ రహీమ్ అలీ భార్య రబీనా ఖాతూన్ బిడ్డకు జన్మనిచ్చింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి