Baba Vanga: 2023లో సౌర తుఫాన్‌..? వెన్నులో వణుకు పుట్టిస్తోన్న బాబా వంగా భవిష్యవాణిలోని అంశాలు..

Baba Vanga: బాబా వంగా.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మనకు పోతులూరి వీర బ్రహ్మం ఎలాగో ప్రపంచానికి బాబా వంగా అలా. వీరిద్దరూ భవిష్యత్తును అంచనా వేస్తూ జరిగే పరిణామాలపై హెచ్చరించారు...

Baba Vanga: 2023లో సౌర తుఫాన్‌..? వెన్నులో వణుకు పుట్టిస్తోన్న బాబా వంగా భవిష్యవాణిలోని అంశాలు..
Baba Vanga
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 24, 2022 | 1:05 PM

Baba Vanga: బాబా వంగా.. ఈ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మనకు పోతులూరి వీర బ్రహ్మం ఎలాగో ప్రపంచానికి బాబా వంగా అలా. వీరిద్దరూ భవిష్యత్తును అంచనా వేస్తూ జరిగే పరిణామాలపై హెచ్చరించారు. బాబా వంగా చెప్పిన విషయాలు ఇప్పటికే కొన్ని నిజమయ్యాయి కూడా. దీంతో బాబా వంగా తన భవిష్యవాణిలో ఏం చెప్పారన్న అంశాలు తెలుసుకోవడానికి ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురు చూస్తోంది.

ప్రతీ ఏటా బాబా వంగా భవిష్యవాణిలో ఏయే అంశాలు ఉన్నాయన్న విషయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2023 గురించి బాబా వంగా ఏం చెప్పారన్న దానికి సంబంధించి కథనాలు వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ బాగా వంగా భవిష్యవాణిలో ఏముంది.? 2023లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోనున్నాయి లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

* బాబా వంగా ఊహించినదాంట్లో జీవ ఆయుధాలు ప్రధానమైంది. దీనినే బయో వెపన్స్‌గా పిలుస్తుంటారు. జీవ ఆయుధాలపై ప్రయోగాలు చేస్తున్న ఓ పెద్ద దేశం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మరణిస్తారని ఆమె పేర్కొన్నారు. గతేడాది ప్రపంచాన్ని అతలాకుతలం చేసినా కరోనా వైరస్‌ను చైనాలోని ఓ ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి

* రానున్న రోజుల్లో ప్రభుత్వాలు సహజ జననాలను నిషేధిస్తాయని బాబా వంగా అంచనా వేశారు. సహజ జననాలను పరిమితం చేస్తూ ఈ భూమిపైకి వచ్చే కొత్త జీవులను ల్యాబ్‌లో సృష్టిస్తారని ఆమె తన భవిష్యవాణిలో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వాలు ఈ పనికి ఎందుకు పూనుకుంటాయన్న అంశం ఆశ్చర్యకరంగా మారింది.

* 2023లో అణు ప్లాంట్‌ల విస్పోటనాలు భారీగా జరిగే అవకాశం ఉందని బాబా వంగా అంచనా వేశారు. ఇప్పటికే ఉక్రెయిన్‌, రష్యాల మధ్య నెలకొన్ని యుద్ధ వాతావారణం ఒకనొక సమయంలో అణు ప్లాంట్‌లను పేల్చడం వరకు వెళ్లిన విషయం తెలిసిందే.

* బాబా వంగా చెప్పిన మరో అంశం 2023లో భూమి కక్ష్య మారుతుందని అంచనా వేశారు. అయితే కచ్చితంగా కక్ష్య మార్పు ఎలా ఉంటుందన్న విషయం తెలియకపోయినప్పటికీ.. అదేగనక జరిగితే సృష్టి వినాశనానికి దారి తీస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

* భూమిపై ఇంతకు ముందెన్నడూ చూడని భారీ సౌర తుఫాను వస్తుందనేది బాబా వంగా చెప్పిన మరో జోస్యం. ఒకవేళ సూర్యుడిపై నిజంగానే సౌర తుఫాన్‌ వస్తే కమ్యూనికేషన్‌ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమై ప్రస్తుతం మన వినియోగిస్తున్న మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు పూర్తిగా స్థంభించిపోతాయి.

ఇదిలా ఉంటే బాబా వంగా 2022లో చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వరదలు సంభవిస్తాయని తెలిపారు. ఆమె చెప్పినట్లుగానే ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలో భారీ వర్షాల కారణంగా వరదుల సంభవించాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు విజృంభిస్తుందని చెప్పారు. ఈ ఏడాది యూరప్‌తో పాటు కొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..