Watch Video: ఇలాంటి పుష్-అప్స్ చూసుండరు.. గంటలో వేల పుష్-అప్స్ చేసి వరల్డ్ రికార్డు సాధించిన అథ్లెట్
వ్యాయామం చేసేవాళ్లలో చాలామంది పుష్ అప్స్ చేస్తుంటారు. శరీరం మంచి ఆకృతిలో రావడానికి, ధృఢంగా మారడానికి పుష్ అప్స్ చేయడం చాలాముఖ్యం. అందుకే ఈ విధానాన్ని వ్యాయామంలో భాగంగా అనుసరిస్తుంటారు. మామూలుగా అయిదే ఓ 50 పుష్ అప్స్ చేయడం చాలా కష్టమైన పని.
వ్యాయామం చేసేవాళ్లలో చాలామంది పుష్ అప్స్ చేస్తుంటారు. శరీరం మంచి ఆకృతిలో రావడానికి, ధృఢంగా మారడానికి పుష్ అప్స్ చేయడం చాలాముఖ్యం. అందుకే ఈ విధానాన్ని వ్యాయమంలో భాగంగా అనుసరిస్తుంటారు. మామూలుగా అయిదే ఓ 50 పుష్ అప్స్ చేయడం చాలా కష్టమైన పని. ఆగకుండా అంతకుమించి ఎవరైనా చేస్తే వారిని ప్రశంసించకుండా ఎవరూ ఉండలేరు. అయితే ఓ వ్యక్తి మాత్రం ఒక గంటలో ఏకంగా 3249 పుష్ అప్స్ చేశాడు. ఇంకేముంది దెబ్బకు గిన్నిస్ వరల్డ్ రికార్డను బద్దలు కొట్టేశాడు. వివరాల్లోకి వెళ్తే ఆస్ట్రేలియాకు చెందిన డానియేల్ అనే అథ్లెట్ గంటలో 3249 పుష్ అప్స్ చేశాడు. గతంలో ఆస్ట్రేలియాకు చెందిన యోల్డ్ లుకాస్ హెల్మ్కే అనే క్రీడాకారుడు గంటలో 3206 పుష్ అప్స్ చేసి గిన్నీస్ రికార్డ్ సాధించాడు.
అయితే ఇప్పుడు ఆ రికార్డును డానియేల్ బ్రేక్ చేశాడు. కానీ డానియేల్‌కు అంత సులువుగా ఈ రికార్డు దక్కలేదు. చిన్నప్పటి నుంచే అతను ఎడమ చేతి నొప్పితో బాధపడుతున్నాడు. అయినప్పటికీ కూడా పట్టు వదలలేదు. ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాడు. గత ఏడాది కూడా డానియేల్ గంటలో 3182 పుష్ అప్స్ చేసి రికార్డు సృష్టించాడు. కాని ఈ రికార్డును యోల్ట్ లుకాస్ బ్రేక్ చేశాడు. ఇప్పుడు తాజాగా డానియేల్ లుకాస్ రికార్డును బద్దలు కొట్టాడు. అతను పుష్ అప్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. నెటీజన్లు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.




మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
