Viral Video: అయ్య బాబోయ్.. కొండచిలువను చంపేసిన చీమల దండు.. షాకింగ్ వీడియో
మనం ఎన్నో విషయాలు కొన్ని ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. మనం నేచర్ నుంచి కొన్ని విషయాలు మనం గమనిస్తే మనుషులకు తత్త్వం బోధపడుతుంది. ముఖ్యంగా చీమలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఎప్పుడు ఐకమత్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎటు వెళ్లిన కలిసి కట్టుగా వెళ్తాయి. వెళ్లేటప్పుడు కూడా ఓ క్రమపద్దతిలో స్ట్రేట్‌గా పోతాయి. మనం అవీ వెళ్లే దారికి చేతి అడ్డు పెట్టినా పక్కనుంచి వెళ్లి మళ్లీ ఆ లైన్‌లో కలుస్తాయి.
మనం ఎన్నో విషయాలు కొన్ని ప్రకృతి నుంచి నేర్చుకుంటూ ఉంటాం. మనం నేచర్ నుంచి కొన్ని విషయాలు మనం గమనిస్తే మనుషులకు తత్త్వం బోధపడుతుంది. ముఖ్యంగా చీమలు చూడటానికి చిన్నవిగా ఉంటాయి. కానీ ఎప్పుడు ఐకమత్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఎటు వెళ్లిన కలిసి కట్టుగా వెళ్తాయి. వెళ్లేటప్పుడు కూడా ఓ క్రమపద్దతిలో స్ట్రేట్‌గా పోతాయి. మనం అవీ వెళ్లే దారికి చేతి అడ్డు పెట్టినా పక్కనుంచి వెళ్లి మళ్లీ ఆ లైన్‌లో కలుస్తాయి. పొరపాటున చీమల గుంపుపై కాళ్లు పడితే ఇక అంతే సంగతులు.. అన్నీ కలిసి ఓకేసారి దాడి చేస్తాయి. తాజాగా చీమకు సంబంధించి ఒక వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియోలోని ఓ నీతి అందరినీ ఆకట్టుకుంటుంది. ‘కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్’ అని మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పిన డైలాగ్ ఈ సందర్భంలో రాంగ్ అనిపిస్తుంది. కటౌట్ ముఖ్యం కాదు అని ఈ వీడియో చూసిన తర్వాత మీకుడా అర్థమవుతుంది.
ఈ వీడియోలో చీమల ప్రాంతంలోకి ఓ కొండచిలువ చొరబడింది. దీంతో అన్నీ చీమలు కలిసి కొండచిలువను అటాక్ చేసి చంపేశాయి. చీమలు చూడ్డానికి చిన్నగా ఉన్న కొండచిలువను మాయం చేసేశాయి. దీన్ని బట్టి మనకు నేచర్ ఏం చెబుతుందంటే.. ఎవరిని ఎప్పుడు తక్కువ అంచనా వేయవద్దని, ఎవరి సామర్థ్యం వారికి ఉంటుందని అర్థమవుతుంది. పాముల్లో బలమైన కొండచిలువనే చిన్న చీమలన్నీ కలిసి భయపెట్టాయి. ఈ నేచర్‌లో ప్రతి ఒక్కదాని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకోవచ్చు. ప్రసుత్తం ఈ వీడియోను ఎక్స్‌లో వైరల్‌గా మారింది.
వీడియో చూడండి:
Snake invades ant territory and gets pulverized!
Nature tells us; never underestimate any living creature, the community is stronger than one …pic.twitter.com/4dj55fVVHF
— Figen (@TheFigen_) September 16, 2024
ఈ వీడియోను చూసిన నెటిజన్స్ రకరకలుగా స్పందిస్తున్నారు. చీమలు తమ సమస్యలు పరిష్కరించడానికి సమిష్టిగా పనిచేస్తాయని కామెంట్స్ పెడుతున్నారు. చీమలు చూడటానికి చిన్నగా ఉన్న తెలివితేటల్లో మనుషులకు మించినవి కొన్ని పరిశోధనల్లో తేలాయి. ముఖ్యంగా చీమల నుంచి లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను నేర్చుకోవచ్చు. ఐకమత్యమే మహబలమనే పాఠాన్నీ చీమల నుంచి అర్థం చేసుకోవచ్చు. చీమలు ఎప్పుడు ఆహారం సేకరించుకుంటూ ఉంటాయి. అవి ఓ క్రమ పద్ధతిలో కఠోర శ్రమతో ఆహారాన్ని సేకరించుకుంటాయి. చీమలను మనం ఎన్నోొ విషయాల్లో ఇన్స్పిరేషన్‌గా తీసుకోవచ్చు.
మరిన్ని ట్రెండింగ్ కథనాలు చదవండి