Anand Mahindra: ఎద్దులు, ఎద్దుల బండి గురించి మనందరికీ తెలుసా..? గ్రామాల్లో గతంలో వ్యవసాయం ఉన్న ప్రతి రైతు ఇంట్లో ఎద్దులు, ఎండ్లబండి తప్పనిసరిగా ఉండేది.. కానీ, ఇప్పుడు వాటి స్థానంలో ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు వంటివి వచ్చి చేరాయి. అయితే, ఇప్పుడు ఈ ఎద్దులు, ఎండ్ల బండి ప్రస్థావన ఎందుకు అనే సందేహం కలుగుతుంది కదా..? ఎద్దులను తెలివి తక్కువ జంతువుగా పరిగణిస్తూ.. వాటిని బరువులు మోయడం, పొలం దున్నడం వంటి బరువైన, కష్టతరమైన పనులు చేసేందుకు వినియోగించేవారు. కానీ, ఎవరి సహాయం లేకుండానే తమ పని తాము చేసుకుంటూ సన్మార్గంలో నడవగలిగేంత తెలివిగలవాళ్లమంటూ ఒక ఎద్దు నిరూపిస్తోంది. ఆ ఎద్దు తెలివితేటలను, అవగాహనను చూస్తే ఎవరికైనా సరే ఆశ్చర్యం కలుగుతుంది. ఆనంద్ మహీంద్రా కూడా సదరు ఎద్దు తెలివితేటలను మెచ్చుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
వైరల్ అవుతున్న వీడియోలో ఒక ఎద్దు స్వయంగా యజమాని చెప్పిన పనులు చేస్తుంది. ఎవరూ నడిపించకోయినప్పటికీ.. ఎద్దుల బండిని తన మెడపై ఎత్తుకుని దాని మార్గంలో అది బయలుదేరుతుంది. ఎక్కడికి వెళ్లాలో దానికి ముందే తెలిసినట్టుగా ఉంది.. అందుకే అది తన మార్గంలో ఎద్దుల బండిని తీసుకుని తను పనిచేయాల్సిన ప్రదేశానికి చేరుకుంటుంది.అంతేకాదు..అవసరమైనప్పుడు ఈ ఎద్దు స్వయంగా బండిని రివర్స్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్లాలో సరిగ్గా అక్కడికే వెళ్లి అక్కడ ఎత్తుకోవాల్సిన లోడ్ తీసుకుంటుంది..తిరిగి ఎక్కడ డౌన్‌లోడ్ చేయాలో యజమాని సూచించిన మేరకు అక్కడ సరుకును అప్పగిస్తుంది. ప్రస్తుతం ఆ ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో లూథియానాలోని ఆశారామ్ గోషాలాకు చెందినదిగా తెలిసింది. ఈ ఎద్దు గుణ గణాలను తెలిపే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఎద్దు పేరు రాము అని తెలిసింది. రాము అన్ని పనులను సరదాగా, అవలీలగా చేసుకుంటూ పోతూ సరదాగా గడుపుతున్న దృశ్యాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియో చూసిన పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కూడా తన స్పందనను తెలియజేశారు.
If Ramu could speak, I bet he would give better advice on how to be ‘Life-Positive’ than every other self-proclaimed motivational speaker in the world. 👏🏽👏🏽👏🏽 pic.twitter.com/Cc62GtTZJp
— anand mahindra (@anandmahindra) January 30, 2024
ఈనాటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే రాముడే బెటర్ అని ఒకరు రాశారు. ఆనంద్ సార్, మీరు కూడా ఇలాంటి రాముని నియమించుకోవాలని సూచిస్తున్నారు. మహీంద్రా ఆటో, టెంపో స్థానంలో రాము వస్తాడు. రాము మాట్లాడగలిగితే తనకు కావాల్సిన ఆహారం సంపాదించడానికి పని చేయడంపై తన ప్రాథమిక దృష్టి అని చెబుతాడని మరొకరు రాశారు. ఇదే జంతువులు, మానవులకు మధ్య వ్యత్యాసం అని మరొకరు రాశారు. జంతువులు వాటి చర్యలతో మాట్లాడతాయి. మనం మన నోటితో మాట్లాడుతాము అంతే అంటున్నారు మరికొందరు నెటిజన్లు. మొత్తానికి ఈ రాముడు అందరి ప్రశంసలు పొందుతున్నాడు..
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..