Viral: మడతపెట్టే ఎలక్ట్రిక్‌ బైక్‌.. వైరల్‌ అవుతోన్న ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌..

ఇక కేవలం స్కూటర్లకు మాత్రమే పరిమితం కాకుండా సైకిల్లను పోలిన చిన్న తరహా బైక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తక్కువ మెయింట్‌నెన్స్‌, ధర కూడా తక్కువ ఉండడం, ఎలాంటి మార్గాల్లో అయినా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండడంతో ఇలాంటి వాటికి ఆదరణ భారీగా పెరుగుతోంది. ఇక ఈ వాహనాల తయారీల్లోనూ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా ఐఐటీ బాంబేకు చెందిన కుర్రాల్లు తయారు చేసిన ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది..

Viral: మడతపెట్టే ఎలక్ట్రిక్‌ బైక్‌.. వైరల్‌ అవుతోన్న ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌..
Foldable E Bike
Follow us
Narender Vaitla

|

Updated on: Oct 22, 2023 | 6:10 PM

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాల హవా నడుస్తోంది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ప్రభుత్వాలు సైతం రాయితీలు ప్రకటించడంతో ఈ వాహనాలు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.

ఇక కేవలం స్కూటర్లకు మాత్రమే పరిమితం కాకుండా సైకిల్లను పోలిన చిన్న తరహా బైక్‌లు కూడా ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. తక్కువ మెయింట్‌నెన్స్‌, ధర కూడా తక్కువ ఉండడం, ఎలాంటి మార్గాల్లో అయినా ఉపయోగించుకునేందుకు వీలుగా ఉండడంతో ఇలాంటి వాటికి ఆదరణ భారీగా పెరుగుతోంది. ఇక ఈ వాహనాల తయారీల్లోనూ కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా ఐఐటీ బాంబేకు చెందిన కుర్రాల్లు తయారు చేసిన ఓ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ప్రపంచంలోనే తొలి డైమండ్ ఫ్రేమ్‌ ఫోల్డబుల్ -బైక్‌ను ఐఐటీ బాంబేకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ బైక్‌కు సంబంధించిన ఫొటోలను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ట్విట్టర్‌లో (ఎక్స్‌) పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. మీడియం స్పీడ్‌ కంటే ఎక్కువ వేగంతో ఈ బైక్‌ దూసుకుపోగలదు. ఈ బైక్‌ను ఫోల్డ్‌ చేస్తున్న ఫొటోలతో పాటు నడిపిస్తున్న ఫొటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు మహీంద్ర. ఈ ఫొటోలతో పాటు.. ‘ఐఐటీ బాంబే కుర్రాళ్లు మళ్లీ గర్వపడేలా చేశారు. ప్రపంచంలోనే పూర్తి స్థాయి చక్రాలతో మొట్టమొదటి ఫోల్డబుల్ డైమండ్ ఫ్రేమ్ ఇ-బైక్ ను రూపొందించారు. మీడియం స్పీడ్ కంటే ఎక్కువ వేగంతో బైక్‌ను డ్రైవ్‌ చేయొచ్చు’ అంటూ ఆనంద్‌ మహీంద్ర రాసుకొచ్చారు.

ఆనంద్ మహీంద్ర ట్వీట్..

ఈ ఫోల్డబుల్ ఇ-బైక్‌ ధర విషయానికొస్తే రూ. 44,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంది. ఇందులో 36వీ, 7.65 ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్‌ చేయడానికి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 45 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ప్రస్తుతం కేవలం ఆన్‌లైన్‌ ద్వారానే ఈ బైక్‌లను అమ్మకానికి ఉంచారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..