Viral: మొసలి లాంటి చేప.. దీని గుడ్లు తింటే మనుషులు ఖతం.!

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వింత జీవికి...

Viral: మొసలి లాంటి చేప.. దీని గుడ్లు తింటే మనుషులు ఖతం.!
Fish
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 12, 2022 | 1:13 PM

సోషల్‌ మీడియాలో నిత్యం ఎన్నో వింతలు, విశేషాలతో కూడిన రకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వింత జీవికి సంబంధించిన వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. అదేంటో తెలుసా. ఇది చూడండి…ఇవి మొసలి లాగా ఉన్నా… ఉభయచరాలు కావు. నేలపై బతకలేవు. వెనక నుంచి చూస్తే చేపలా ఉంటుంది. ముందు నుంచి చూస్తే మొసలిలా ఉంటుంది. అందుకే దీన్ని ఎలిగేటర్ గార్ అంటారు. ఉత్తర అమెరికాలోని పరిశుభ్రమైన నీటిలో ఇవి ఉంటాయి. 10 అడుగుల పొడవు పెరగగలవు. 160 కేజీల బరువు పెరగగలవు. ఈ చేపలు మనుషులకు హాని చెయ్యవు. కానీ వీటి గుడ్లు మనుషులకు విషంతో సమానం. అందుకనే ఈ చేపల గుడ్లను ఏ సముద్ర జీవులూ తినవు. ప్రస్తుతం ఈ చేపకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి.

Fish 1