Air India: బంగారం ధరించే విషయంలో ఎయిర్ ఇండియా న్యూ రూల్స్.. ఇప్పుడు తప్పక తెలుసుకోండి..

|

Feb 14, 2022 | 11:23 AM

Air India: భారీ నష్టాలతో నడుస్తున్న ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టే పనిలో టాటా సంస్థ(Tata Group) నిమగ్మమైంది. ఇందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమానాల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించేందుకు బంగారం(Gold) విషయంలో..

Air India: బంగారం ధరించే విషయంలో ఎయిర్ ఇండియా న్యూ రూల్స్.. ఇప్పుడు తప్పక తెలుసుకోండి..
Air India
Follow us on

Air India: భారీ నష్టాలతో నడుస్తున్న ఎయిర్ ఇండియాను గాడిలో పెట్టే పనిలో టాటా సంస్థ(Tata Group) నిమగ్మమైంది. ఇందుకోసం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. విమానాల రాకపోకల్లో జాప్యాన్ని తగ్గించేందుకు బంగారం(Gold) విషయంలో కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అదేంటంటే కాబిన్ క్రూ(Cabin Crew) సిబ్బంది విమానంలోకి ఎక్కాక కేవలం పీపీఈ కిట్ ధరించాలని ప్రకటన విడుదల చేసింది. దీనికి తోడు కాబిన్ క్రూ వీలైనంత తక్కువ బంగారు ఆభరణాలను ధరించాలని సూచించింది. దీని వల్ల సెక్యూరిటీ చెక్ విషయంలో పట్టే సమయాన్ని ఆదా అవుతుందని, ఇమిగ్రేషన్ ప్రాసెంస్ పూర్తయ్యాక డ్యూటీ ఫ్రీ షాపులకు వెళ్లకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల సమయానికి విమానాలను నడిపేందుకు ఇంది ఎంతగానో దోహదపడుతుందని సంస్థ ప్రతినిధి తెలిపారు.

యూనిఫామ్ నిబంధనల్లో భాగంగా బంగారం తక్కువగా ధరించాలని.. దీనివల్ల ఇమిగ్రేషన్, సెక్యూరిటీ చెక్కింగ్ వద్ద సమయం ఆదా అవుతుందని పేర్కొంది. తప్పనిసరి ప్రీఫ్లైట్ చెక్ క్లియరెన్స్‌ని ఆలస్యం కాకుండా చూడాలని క్యాబిన్ సిబ్బందిని కోరింది. నిర్ణీత సమయాలలో లేదా ముందుగానే గ్రౌండ్ సిబ్బందికి బోర్డింగ్ కోసం క్లియరెన్స్ ఇవ్వాలని క్యాబిన్ సూపర్‌వైజర్‌కు సూచించింది. బోర్డింగ్ ముందు క్యాబిన్ సిబ్బంది ఆహారం, పానీయాలు తీసుకోవద్దని.. దానివల్ల ప్రయాణికులను వేగంగా విమానంలోకి ప్రయాణించేందుకు లోపల అవసరమైన సేవలు అందించాలని కోరింది. దీనికి తోడు విమాన ద్వారాన్ని సమయానికి మూయడంలో ఎటువంటి జాప్యం చేయెుద్దని ఆదేసించింది. తదుపరి జాప్యం లేకుండా విమానాలను ఎయిర్ పోర్టు నుంచి నిర్ధేసించిన సమయానికి గమ్యస్ధానాలకు బయలుదేలా చూడాలని స్పష్టం చేసింది.

ఇవీ చదవండి.. 

China Apps Ban: కొత్తగా ఆ 54 చైనా యాప్ లు బ్యాన్.. భారత ప్రభుత్వం నిర్ణయం..

Airtel Vs Jio: ఎయిర్ టెల్ కు ధీటుగా జియో.. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవల కోసం ఏం చేసిందంటే..

Stock Market Crash: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు.. సూచీలు ఎన్ని పాయింట్లు పడ్డాయంటే..