ఏదైనా నేరం చేసి పట్టుబడిన వారిని అరెస్ట్ చేసిన తరువాత, కోర్టులో ప్రవేశపెడతారు.. ఆ క్రమంలో నిందితులు తమకు ఎలాంటి శిక్ష పడుతుందోననే ఆందోళనలో ఉంటారు.. కొందరు ఇకపై మారిపోయి సరైన జీవితం గడపాలని భావిస్తారు.. మరికొందరు పదే పదే జైలుకు వెళ్లటం, తిరిగి విడుదలైన తర్వాత కూడా మళ్లీ అదే పాత బుద్ధిని ప్రదర్శిస్తుంటారు.. కానీ, ఒక కోర్టులో దీనికి విరుద్ధంగా ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చోరీకి పాల్పడి జైలుకెళ్లిన ఒక దొంగ కటకటాల్లో శిక్ష అనుభవిస్తున్నా.. తన నేరాన్ని మర్చిపోయాడు… కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఏకంగా జడ్జికి లైన్ వేసి మరో తప్పు చేశాడు. అవును, చోరీకి పాల్పడ్డ ఓ దొంగ కోర్టులో జడ్జి తీర్పు చెప్పే సమయంలో ఆ మహిళ జడ్జ్‌కే ఐ లవ్ యూ చెప్పేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇలాంటి విచిత్రమైన, ఊహించని సంఘటన ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ కోర్టు ఈ వింత ఘటనకు సాక్షిగా నిలిచింది.
వీడియోలో ఒకవైపు దొంగతనం ఆరోపణలు ఎదుర్కొంటున్న డెమెట్రియస్ లూయిస్, మరోవైపు విచారణను నిర్వహించడానికి మహిళా న్యాయమూర్తి తబితా బ్లాక్‌మన్ ఉన్నారు. న్యాయమూర్తి వర్చువల్ కోర్టు ద్వారా తీర్పును చదవడం ప్రారంభించినప్పుడు, చూస్తూ ఊరుకోని నిందితుడు వింతగా ప్రవర్తించడం ప్రారంభించాడు. మీరు చాలా అందంగా ఉన్నారు ఐ లవ్ యూ అంటూ లవ్ ప్రపోజల్ చేశాడు. ఇలా తాను చేసిన నేరానికి శిక్షను ప్రకటిస్తున్నది కోర్టు న్యాయమూర్తితో నిందితుడు అనుచితంగా ప్రవర్తించడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు ఇలా అనడంతో కాస్త కలవరపడిన మహిళా న్యాయమూర్తి.. అనంతరం నవ్వుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే వీడియోని మిలియన్ల మంది వీక్షించారు.
లూయిస్ చోరీకి గల కారణాలను, కోర్టులో అతని ప్రవర్తనకు గల కారణాలను తెలుసుకున్న న్యాయమూర్తి తబిత.. 5 వేల డాలర్ల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. న్యూయార్క్ పోస్ట్ నివేదిక ప్రకారం, లూయిస్ ఇప్పటికే 4 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. జడ్జితో దురుసుగా ప్రవర్తించినందుకు శిక్షించనప్పటికీ, అతను తన ప్రవర్తనతో ట్రోల్స్‌కు గురి అయ్యాడు. మొత్తానికి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి సందడి చేస్తోంది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..