ప్రతిరోజూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వేదికగా అనేకరకల వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇవి చూడటానికి చాలా షాకింగ్, ఫన్నీగా ఉంటాయి. కొన్ని వీడియోలు ఆలోచింపజేసేవిగా ఉంటే, మరికొన్ని వీడియోలు ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ఇక కొందరు వ్యక్తులు చేసే సరదా పనులు మనల్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా ఇద్దరు మహిళలకు సంబంధించిన వీడియో చాలా క్రేజీగా కనిపించింది. రైల్వే స్టేషన్‌లో ఇద్దరు మహిళలు యాక్సిలరేటర్‌పై వెళ్లేందుకు ఎలా కష్టపడుతున్నారో చూసి ప్రతి ఒక్కరూ నవ్వుకుంటున్నారు. యాక్సిలరేటర్ ఎక్కేందుకు వాళ్ల స్టైల్ చాలా డిఫరెంట్‌గా ఉంది. కానీ రిస్క్‌తో కూడుకున్నది. పూర్తి వివరాల్లోకి వెళితే…
ఒక రైల్వే స్టేషన్‌లో యాక్సిలరేటర్ ఎక్కేందుకు ఇద్దరు మహిళలు చాలా భయపడిపోయారు. ఆ భయం కారణంగా వారు పైకి వెళ్లేందుకు వెరైటీగా ట్రై చేశారు. యాక్సిలరేటర్ మెట్లపై కూర్చుని రెండు చేతులను కిందపెట్టి పైకి వెళ్లారు.. నాలుగు కాళ్లతో నడిచే జంతువులా వారు పైకి వెళ్లటం అక్కడి సీసీ కెమెరాలో రికార్డైంది. కాగా, వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 7 లక్షలకు పైగా వీక్షించారు. అయితే ఈ ఘటన ఏ రైల్వే స్టేషన్‌లో జరిగిందో మాత్రం తెలియరాలేదు. వైరల్ అవుతున్న వీడియోపై జనాలు పెద్ద ఎత్తున స్పందించారు.
ఈ వీడియో చూడండి..
Tf why?💀😭
pic.twitter.com/sHDAqeGIV1— Ghar Ke Kalesh (@gharkekalesh) August 26, 2024
ఈ మహిళల వీడియోపై నెటిజన్లు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఇలా వ్రాశాడు – చిన్నప్పుడు మాల్‌కి మొదటిసారి వెళ్ళడం నాకు గుర్తుంది. అది నాకు కొత్త అనుభవం. మా తల్లిదండ్రులు, సోదరి యాక్సిలరేటర్‌పై అడుగు పెట్టినప్పుడు, నా వెన్నులో వణుకు వచ్చింది. నా తమ్ముడు వెనక్కి తిరిగి వచ్చి నన్ను తనతో తీసుకెళ్ళాడు. యాక్సిలరేటర్‌కు భయపడే ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను ఇక్కడ షేర్ చేసుకుంటున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..