AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ముంబై లోకల్ ట్రైన్ లో రెచ్చిపోయిన యువతి.. అసభ్యంగా డాన్స్ చేసి, తోటి ప్రయాణికుల ఆగ్రహానికి గురై!

సోషల్ మీడియా వ్యామోహమో సినిమా ఎఫెక్టో కానీ.. ఈ జనరేషన్ వాళ్లు ఇష్టానుసారంగా ప్రవరిస్తూ పబ్లిక్ కు చిరాకును తెప్పిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేస్తూ తోటివాళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఓ యువతి ముంబై లోకల్ ట్రైన్ లో అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది.

Viral Video: ముంబై లోకల్ ట్రైన్ లో రెచ్చిపోయిన యువతి.. అసభ్యంగా డాన్స్ చేసి, తోటి ప్రయాణికుల ఆగ్రహానికి గురై!
Mumbai
Balu Jajala
|

Updated on: Feb 25, 2024 | 7:30 AM

Share

సోషల్ మీడియా వ్యామోహమో సినిమా ఎఫెక్టో కానీ.. ఈ జనరేషన్ వాళ్లు ఇష్టానుసారంగా ప్రవరిస్తూ పబ్లిక్ కు చిరాకును తెప్పిస్తున్నారు. పబ్లిక్ ప్లేసుల్లో రీల్స్ చేస్తూ తోటివాళ్లకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. తాజాగా ఓ యువతి ముంబై లోకల్ ట్రైన్ లో అసభ్యంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఆమె తన సీటును వదిలి కొన్ని బార్ గర్ల్ మాదిరిగా డాన్సు చేస్తూ ప్రయాణీకుల దృష్టిని ఆకర్షించింది. బోజ్ పురి పాట ‘సైయా మారే సాతా సాత్’కు ఆమె డ్యాన్స్ చేసింది. ముంబై లోకల్ ట్రైన్ లోని లేడీస్ బోగీలో ఈ రీల్ రికార్డయింది.

ముదురు నలుపు రంగు దుస్తులు ధరించిన ఆ అమ్మాయి ఎలాంటి బిడియం లేకుండా సెల్ ఫోన్ కెమెరా ముందు డాన్స్ చేసింది. తమతో పాటు చిత్రీకరించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు బ్యాగులతో ముఖాలు దాచుకోగా, మరికొందరు వీడియోలో భాగం కావడం ఇష్టంలేక ట్రైన్ దిగి వెళ్లిపోయారు.

అదేవిధంగా అదే డ్యాన్సర్ కు చెందిన మరో వీడియో కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. వారు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. ఇతర ప్రయాణీకులకు ఇబ్బందిగా ఉందని మండిపడ్డారు. ఈ ఘటన సెంట్రల్ రైల్వేలో రికార్డయింది. ఇంటర్నెట్ లో హల్ చల్ చేసిన డాన్స్ రీల్ ను గమనించిన రైల్వే అధికారులు ఎక్స్ పోస్ట్ లో స్పందించి ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ముంబై రైల్వే పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ రైల్వే సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ ను ఆదేశించింది.

ఇదిలా ఉంటే డాన్స్ రీల్స్ పై స్పందించిన జనాలు దీన్ని ‘క్రేజీ’ అని కామెంట్ చేశారు. దీనికి సమాధానంగా మరికొందరు మీమ్స్ షేర్ చేయగా..  ‘ఇది మరీ టూమచ్’ అంటూ విరుచుకుపడ్డారు. పబ్లిక్ రైలులో ఇంటివారిని రైలులో అనుమతించకూడదని నేను అనుకుంటున్నాను.. అని మరికొందరు రియాక్ట్ అయ్యారు.

Follow Us
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!
ఒక్క మ్యాచ్‌లో 19 భారీ రికార్డ్స్.. లిస్ట్ చూస్తే షాకే..!