AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్.. ఫన్నీ వీడియో

ప్రస్తుత ఆన్ లైన్ యుగంలో అన్ని రకాల పనులు ఒక్క క్లిక్ తో జరిగిపోతున్నాయి. ప్రజలు అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళితే నగదుకు బదులుగా డిజిటల్ పేమెంట్స్ విధానంలో..

మీరెప్పుడైనా ఇలాంటి డిజిటల్ పేమెంట్ చేశారా.. కస్టమర్ చేసిన పనికి యజమాని షాక్.. ఫన్నీ వీడియో
Digital Payments
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 9:54 AM

Share

ప్రస్తుత ఆన్ లైన్ యుగంలో అన్ని రకాల పనులు ఒక్క క్లిక్ తో జరిగిపోతున్నాయి. ప్రజలు అన్నీ ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేస్తున్నారు. మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళితే నగదుకు బదులుగా డిజిటల్ పేమెంట్స్ విధానంలో నగదు చాలమణీ చేస్తుంటారు. ఈ పద్ధతి చాలా ఫేమస్ అయ్యింది. ఎంతగా అంటే గల్లీలో ఉండే కిరాణ షాపుల్లోనూ ఫోన్ పే, గూగుల్ పే స్కానర్ బోర్డులు వెలుస్తున్నాయి. అంతే కాకుండా డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా మాత్రమే చెల్లింపులు చేస్తుంటారు. మీరు కూడా షాపింగ్‌కు వెళితే ఎప్పుడో ఒక్క సారైనా ఇలాంటి విధానాన్ని పాటించే ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో షాపింగ్ చేసే వ్యక్తి డబ్బులు పే చేసే విధానం చూసి షాప్ యజమాని అవాక్కైపోతాడు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి షాపింగ్ చేసేందుకు మాల్ కు వస్తాడు. తనకు కావాల్సిన వస్తువులను తీసుకున్నాడు. అయితే యజమానిని ఆట పట్టించేందుకు సరదా ప్రయత్నం చేస్తాడు. తన డెబిట్ కార్డును మాస్క్‌లో దాచిపెట్టి, వస్తువులు కొనుగోలు చేసిన తర్వాత చెల్లింపు కోసం కౌంటర్‌కి వెళ్లడాన్ని చూడవచ్చు.

ఆ సమయంలో యజమాని కార్డుతో చెల్లించేందుకు మెషీన్ తీసుకున్నాడు. దీని తర్వాత ఆ వ్యక్తి మిషన్ ను తన నుదుటిపై అద్ది, నోటి వద్ద కాస్త సమయం ఉంచుతాడు. అంతే వెంటనే మెషిన్ నుంచి పేమెంట్ చేసినట్లు స్లిప్ బయటకు వస్తుంది. దాన్ని చూసి షాపు యజమాని ఉలిక్కిపడ్డాడు. ఇది ఎలా సాధ్యమైందని తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. ‘దేవుడు ఎల్లప్పుడూ సహాయం చేస్తాడు’ అనే ఫన్నీ క్యాప్షన్ వీడియోకు యాడ్ చేశారు.

ఇవి కూడా చదవండి

కేవలం 30 సెకన్లు నిడివి కలిగిన ఈ వీడియోకు ఇప్పటివరకు 3 మిలియన్లు వ్యూస్, 79 వేల మందికి పైగా లైక్స్ వచ్చాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసి కొందరు నవ్వుకుంటుండగా.. ఫన్నీ షో అని కొందరు అంటున్నారు. అయితే, కొంతమంది వినియోగదారులు ఈ చెల్లింపు పద్ధతిని నమ్మకూడదని కూడా అంటున్నారు, ఎందుకంటే అతను మెషిన్‌లో మొత్తాన్ని నమోదు చేయలేదు లేదా దుకాణ యజమాని అతని వస్తువుల బార్ కోడ్‌ను స్కాన్ చేయలేదని లాజిక్ గా స్పందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి