AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కిక్కెక్కితే ఇలాగే ఉంటుంది.. సోషల్ మీడియాను ఊపేస్తున్న మందుబాబు డ్యాన్స్.. మీరూ చూసేయండి..

సోషల్ మీడియా.. కుర్రకారును ఊపేస్తున్న మాధ్యమం ఇది. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు క్షణం కూడా ఖాళీ లేకుండా ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. సెల్ ఫోన్ వాడకం పెరగడం, డేటా..

కిక్కెక్కితే ఇలాగే ఉంటుంది.. సోషల్ మీడియాను ఊపేస్తున్న మందుబాబు డ్యాన్స్.. మీరూ చూసేయండి..
dance viral
Ganesh Mudavath
|

Updated on: Oct 09, 2022 | 9:02 PM

Share

సోషల్ మీడియా.. కుర్రకారును ఊపేస్తున్న మాధ్యమం ఇది. పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు క్షణం కూడా ఖాళీ లేకుండా ఇంటర్నెట్ లో మునిగి తేలుతున్నారు. సెల్ ఫోన్ వాడకం పెరగడం, డేటా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో దీనిని ఉపయోగిస్తున్న వారి సంఖ్య మరింత అధికంగా మారింది. కరోనా తర్వాత ఈ పరిస్థితి మరింత అధికంగా మారింది. లాక్ డౌన్ లో సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగింది. అదే సమయంలో ప్రజల్లో దాగి ఉన్న ట్యాలెంట్ ను బయటకు తీసుకువచ్చేందుకు కూడా ఇది అద్భుత సాధనంగా ఉపయోగపడింది. డ్యాన్స్, సింగింగ్, టిప్స్, కుకింగ్, అడ్వెంచర్స్.. ఇలా ఒక్కటేమిటి.. సమస్తం ఇంటర్నెట్ లో ఒదిగిపోయాయి. అంతే కాదండోయ్.. సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన వారు ఎందరో. మొన్న కచ్చా బాదం, నిన్న బంగారం.. ఒకటి చెప్పనా, నేడు.. కండక్టర్ ఝాన్సీ ఇలా ఎందరో రాత్రికి రాత్రే సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా మారిపోయారు. అంతే కాకుండా చాలా మంది తమ అభిప్రాయాలను పంచుకునేందుకు సామాజిక మాధ్యమాన్ని మంచి ప్లాట్ ఫామ్ గా మార్చుకుంటున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సోషల్ మీడియా కారణంగా వివిధ రకాల యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. దీంతో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు.

సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు చాలానే ఉన్నాయి. చాలా మంది నెటిజన్లు చూసిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ గా మారుతుంటాయి. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్ భామ సుష్మితాసేన్ ‘దిల్‌బ‌ర్’ పాట‌కు ఓ యువతి అద్భుత‌మైన స్టెప్పులేసింది. అయితే ఇటీవ‌ల అదే పాట‌కు ఓ యువ‌తి అత్యంత ర‌ద్దీగా ఉండే మార్కెట్‌లో డ్యాన్స్ చేసింది. ఆ యువ‌తి డ్యాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే, సోష‌ల్ మీడియాలో ఆ డ్యాన్స్ వీడియో వైర‌ల్ కావ‌డానికి యువ‌తి కార‌ణం కాదు. మరెంటో తెలుసా.. ఓ మందు బాబు.. అవునండి ఓ మందుబాబు వేసిన స్టెప్స్ ను నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

యువ‌తి డ్యాన్స్ చేస్తున్నప్పుడు అమెను అనుక‌రిస్తూ ఓ మందుబాబు కూడా స్టెప్పులేశాడు. తాగిన మైకంలో తన స్టైల్లో డ్యాన్స్ చేశాడు. ఇది నెటిజ‌న్‌ల‌ను క‌డుపుబ్బా న‌వ్విస్తోంది. ఇప్పటివ‌ర‌కు ఈ వీడియోను 2.60 ల‌క్షల మంది వీక్షించారు. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. యువ‌తి కంటే ఆమె వెనుకున్న వ్యక్తే బాగా డ్యాన్స్ చేశాడ‌ని కామెంట్లు రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి