Viral Video: ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు..

నగరంలోని రోడ్లపై ప్రయాణం చేయడం అంత సులభం కాదు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఎప్పుడు గమ్యస్థానం చేరుతామో తెలియని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ముందుకు...

Viral Video: ఈ ఆటో డ్రైవర్ దిమాగ్ కు దండం పెట్టాల్సిందే.. ప్యాసింజర్ కే ముచ్చెమటలు పట్టించాడు..
Auto Driver Video

Updated on: Dec 02, 2022 | 1:38 PM

నగరంలోని రోడ్లపై ప్రయాణం చేయడం అంత సులభం కాదు. విపరీతమైన ట్రాఫిక్ కారణంగా ఎప్పుడు గమ్యస్థానం చేరుతామో తెలియని పరిస్థితి. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుపోతే ఆ పరిస్థితి వర్ణనాతీతం. ముందుకు వెళ్లలేక, వెనకకు రాలేక.. మెల్లగా కదులుతున్న వాహనాల మధ్య చిక్కుకుపోవడం నరకాన్ని తలపిస్తుంది. దాదాపు అందరూ ఈ పరిస్థితిని ఫేస్ చేసే ఉంటారు. ట్రాఫిక్ జాం అయినప్పుడు కొందరు మ్యూజిక్ వినడం, మ్యాగజైన్ లేదా న్యూస్ పేపర్స్ చదువుతూ కాలక్షేపం చేస్తుంటారు. కొందరు పక్కనున్న వారితో మాట్లాడుతుంటారు. మరోవైపు.. ఆటో డ్రైవర్లు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ వారికి అనుకున్న సమయానికి డెస్టినేషన్ కు చేరుస్తుంటారు. అయితే వారూ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుంటే.. ప్రస్తుతం సరిగ్గా అలాంటి ఘటనే జరిగింది. కానీ ఖాళీ సమయంలో ఆ ఆటో డ్రైవర్ చేసిన పనికి అందరూ నోరెళ్లబెట్టాల్సిందే. ఎందుకో తెలుసుకోవాలనుందా.. అయితే లేటెందుకు. లెట్స్ మూవ్..

రాజీవ్ కృష్ణ అనే వ్యక్తి తన ఇన్‌స్టా ఖాతా నుంచి ఒక వీడియోను పంచుకున్నారు. తాను ముంబయి ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నానని, చివరి 3 కిలోమీటర్లు దూరాన్ని పూర్తి చేయడానికి దాదాపు గంట సమయం పడుతుందని గూగుల్ మ్యాప్స్ చెబుతోందన్నాడు. ఆటో వదిలేసి కాలినడకన బయలుదేరాలని అనుకున్నప్పటికీ.. తన పరిస్థితిని గమనించిన డ్రైవర్‌ మాటల్లో పెట్టాడని చెప్పాడు. ఆటో డ్రైవర్ రాజీవ్ ను ఏయే దేశాలకు వెళ్లారు అని అడగగా.. రాజీవ్ వ్యంగ్యంగా కొన్ని ప్రాంతాల పేర్లు చెప్పాడు. అయితే ఆ తర్వాత డ్రైవర్ అలా చేస్తాడని రాజీవ్ అస్సలు ఊహించలేదు. రాజీవ్ చెప్పిన ప్రదేశాలు తనకు తెలుసునని, అంతే కాకుండా యూరప్ ఖండంలోని మొత్తం 44 దేశాల పేర్లు టకటకా చెప్పేయడంతో ఆశ్చర్యపోవడం రాజీవ్ వంతైంది.

ఇవి కూడా చదవండి

ఈ ఆటో డ్రైవర్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. తన రాష్ట్రంలోని అన్ని జిల్లాల పేర్లు తెలుసు. కొద్ది రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. షేర్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 38 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి