కంపార్ట్ మెంట్ లోకి వెళ్లాలంటే .. స్పైడర్ మ్యాన్ గా మారాల్సిందే.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..
వేగంగా పెరిగిపోతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలతో డేటా వినియోగం అధికంగా ఉంది. సెల్ ఫోన్ ల వాడకం పెరగడంతో మరిన్ని ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. కరోనా తర్వాత ఈ వినియోగం..
వేగంగా పెరిగిపోతున్న సాంకేతికత, అందుబాటులోకి వస్తున్న సౌకర్యాలతో డేటా వినియోగం అధికంగా ఉంది. సెల్ ఫోన్ ల వాడకం పెరగడంతో మరిన్ని ఫెసిలిటీస్ అందుబాటులోకి వచ్చాయి. కరోనా తర్వాత ఈ వినియోగం మరింత అధికమైంది. ఇంటర్నెట్ లో రోజూ ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్, డౌన్ లోడ్ అవుతుంటాయి. కుకింగ్, సింగింగ్, డ్యాన్సింగ్ వంటి వాటికి కొదవే లేకుండా పోయింది. వీటిలో కొన్ని ఆనందం కలిగిస్తే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. సోషల్ మీడియాలో వివిధ రకాల వీడియోలను చూడవచ్చు. మొబైల్‌ను స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకు నచ్చిన కంటెంట్ కనిపించగానే ఆపేసి ఒకటికి రెండు సార్లు చూసుకుంటాం. ఇది మన మూడ్ ను మారుస్తుంది. అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చాలా ఫన్నీగా ఉంది. కానీ మీరు దీన్ని ప్రయత్నించకుండా ఉండటమే మంచిది. పండుగల సమయంలో రైళ్లలో రద్దీ చాలా అధికంగా ఉంటుంది. ఎంతగా అంటే కనీసం కాళ్లు పెట్టేందుకూ వీలు లేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎవరైనా రైలు ఎక్కినప్పుడు వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది.
ప్రస్తుతం ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి స్పైడర్‌మ్యాన్‌గా మారిపోయాడు. ఎందుకో ఈ వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. సాధారణంగా రైల్వే జనరల్ కోచ్ లో ప్రయాణికులు కిక్కిరిసి ఉంటారు. అలాంటి సమయంలో తమ సీటు నుంచి బయటకు వెళ్లి మళ్లీ సీటు వద్దకు చేరుకోవడం చాలా శ్రమతో కూడుకున్న పని. కానీ ఓ యువకుడు మాత్రం చాలా రద్దీలోనూ సులభంగా సీటు వద్దకు చేరుకున్నాడు. ఈ క్లిప్ లో కిక్కిరిసిన రైలు కంపార్ట్‌మెంట్‌కి వెళ్లేందుకు రైలు కంపార్ట్‌మెంట్‌లోని గ్రిప్ హ్యాండిల్ సహాయంతో ఊగుతూ, జంప్ చేస్తూ ఓ కుర్రాడు సులభంగా సీటు వద్దకు రీచ్ అయ్యాడు.
स्पाइडरमैन भारत में। pic.twitter.com/5QNjJ8OzfP
— Professor ngl राजा बाबू ?? (@GaurangBhardwa1) October 13, 2022
కాగా.. ఈ ఘటనను కంపార్ట్‌మెంట్‌లో ఉన్న మిగిలిన ప్రయాణీకులు చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. వీడియోను షేర్ చేస్తూ గౌరవ్ భరద్వాజ్ స్పైడర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా అని రాశారు. దీన్ని 40 వేల మందికి పైగా చూశారు. అంతే కాకుండా ఈ సంఖ్య మరింతగా పెరుగుతోంది. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.