AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending: 24 ఏళ్లుగా కొబ్బరే అతని ఆహారం.. ఆ సమస్య వచ్చినప్పటి నుంచి ఇదే డైట్..

శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకూ పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాలి. మనదేశంలో చాలా మంది ప్రజలు తమతమ..

Trending: 24 ఏళ్లుగా కొబ్బరే అతని ఆహారం.. ఆ సమస్య వచ్చినప్పటి నుంచి ఇదే డైట్..
Coconut Health
Ganesh Mudavath
|

Updated on: Feb 18, 2023 | 1:42 PM

Share

శరీరానికి అవసరమైన శక్తిని అందించడానికి ఆహారం తీసుకోవడం చాలా అవసరం. అంతే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకూ పోషక పదార్థాలు ఎక్కువగా ఉన్న పదార్థాలను తినాలి. మనదేశంలో చాలా మంది ప్రజలు తమతమ భౌగోళిక, సాంస్కృతిక పరిస్థితుల ఆధారంగా ఆహారపు అలవాట్లలో మార్పులు ఉంటాయి. దక్షిణ భారతదేశంలో ఎక్కువగా వరిని ఆహారంగా తీసుకుంటే.. ఉత్తర భారతంలో మాత్రం గోధుమలను ఎక్కువగా వినియోగిస్తారు. మనం తీసుకునే ఆహారం కడుపు నింపడమే కాకుండా.. ఆరోగ్య ప్రయోజనాలను అందించేవిగానూ ఉండాలి. అయితే.. బాలకృష్ణన్ అనే వ్యక్తి మాత్రం 24 ఏళ్లుగా కేవలం కొబ్బరిని మాత్రమే ఆహారంగా తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొబ్బరికాయ తిని ఎవరైనా ఎలా బతకగలరని ఆలోచిస్తున్నారా.. అందుకు బాలకృష్ణనే సజీవ సాక్ష్యం.

షహనాజ్ అనే టూరిస్టర్.. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బాలకృష్ణన్ ఆరోగ్యకరమైన దినచర్య గురించి సమాచారాన్ని పంచుకున్నారు. బాలకృష్ణ 24 సంవత్సరాలుగా కేవలం కొబ్బరి ఆహారాన్ని మాత్రమే తీసుకుంటున్నాడు. బాలకృష్ణన్ ఒకప్పుడు గ్యాస్‌కు సంబంధించిన సమస్యను ఎదుర్కొన్నారు. దీంతో అనారోగ్యానికి గురయ్యారు. దాని నుంచి ఉపశమనం పొందేందుకు డైట్ లో కొబ్బరికాయను భాగం చేసుకున్నాడు. కాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు కొబ్బరిలో ఉన్న కొబ్బరిని తినడం ద్వారా అతనికి కావలసిన శక్తి లభిస్తోంది.

ఇవి కూడా చదవండి

దాదాపు రెండు దశాబ్దాలుగా కేవలం కొబ్బరి ఆహారాన్ని మాత్రమే అనుసరిస్తున్న విషయం.. నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొబ్బరికాయతో మనకు కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే.. ఇది మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కడుపులో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కాబట్టి బాలకృష్ణలా పూర్తి కొబ్బరి ఆహారాన్ని తీసుకోలేకపోయినా.. డైట్ లో భాగం చేసుకుని అప్పుడప్పుడు తినడం మంచిది.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..