Trending Video: చిన్న పిల్లలను తీసుకొని రోడ్డుపైకి వెళ్తున్నారా.. జాగ్రత్త!.. నెట్టింట వీడియో వైరల్..
రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనకా చూసుకుని నడవాలి. డ్రైవింగ్ చేసే వారు మరింత అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై వాహనదారులే కాదు, పాదచారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలను...
రోడ్డుపై వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందూ వెనకా చూసుకుని నడవాలి. డ్రైవింగ్ చేసే వారు మరింత అలర్ట్ గా ఉండాలి. రోడ్డుపై వాహనదారులే కాదు, పాదచారులు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లలను వెంటపెట్టుకుని వెళ్లినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు దాటేప్పుడు వాహనాలను జాగ్రత్తగా గమనించి వెళ్లాలి. చిన్నారుల చేయిపట్టుకొని కేర్ ఫుల్ గా దాటాలి. లేదంటే ఇదుగో ఇలాంటి ప్రమాదాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ తల్లి తన కూతురితో రోడ్డు దాటుతుంది. ఇద్దరూ రోడ్డు దాటడానికి డివైడర్ వరకు వచ్చారు. అప్పడే పాపకు ఏం గుర్తుకొచ్చిందో తిరిగి వెనక్కు పరుగెత్తింది. అంతే అటు వైపు నుంచి వేగంగా వస్తున్న టాటా ఏస్ వాహనం పాపను ఢీ కొట్టింది. తీవ్ర గాయాలైన పాప అక్కడిక్కడే మృతి చెందింది.
ఈ ఘటన మేడ్చల్ జిల్లా షామీర్ పేటలో జరిగింది. ఈ ఘటనపై స్పందించిన ట్రాఫిక్ ఎస్సై శ్వేత.. రోడ్డు దాటేటప్పుడు పిల్లల చేతులను తప్పకుండా పట్టుకోవాలని చెప్పారు. చిన్న పిల్లలతో రోడ్డు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రోడ్డు ఎలా దాటాలో పిల్లలకు చెప్పాలన్నారు. జీబ్రా క్రాసింగ్ వద్దే రోడ్డు దాటాలని సూచించారు. ఫుట్ పాత్ ఉపయోగించుకోవాలి కోరారు. కాగా ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..