Crows: క్లీనింగ్ కోసం కాకులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. వీటి ముందు మనుషులు కూడా బలాదూరే..

|

Feb 03, 2022 | 4:05 PM

Crows: కాకులు నిత్యం కావ్‌ కావ్‌ మంటూ అరుస్తుంటాయి, కార్లపై, ఆగివున్న బైక్‌లపై రెట్టలు వేస్తూ పాడుచేస్తుంటాయి మనకు తెలిసింది ఇదే. ఇంకొందరైతే కాకి అరిస్తే బందువులు వస్తారని, కాకి తాకితే అపశకునమంటూ నమ్ముతుంటారు. అయితే ఈ కాకులు..

Crows: క్లీనింగ్ కోసం కాకులను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. వీటి ముందు మనుషులు కూడా బలాదూరే..
Follow us on

Crows: కాకులు నిత్యం కావ్‌ కావ్‌ మంటూ అరుస్తుంటాయి, కార్లపై, ఆగివున్న బైక్‌లపై రెట్టలు వేస్తూ పాడుచేస్తుంటాయి మనకు తెలిసింది ఇదే. ఇంకొందరైతే కాకి అరిస్తే బందువులు వస్తారని, కాకి తాకితే అపశకునమంటూ నమ్ముతుంటారు. అయితే ఈ కాకులు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడితే, మనుషులు చేస్తున్న తప్పును సరిదిద్దితే. ఎలా ఉంటుంది.? కాకులేంటి మనుషుల తప్పులను సరిదిద్దడం ఏంటనీ అనుకుంటున్నారా.? అయితే కాకులు చేస్తోన్న గొప్ప పని ఏంటో తెలియాలంటే మనం స్వీడన్ వరకు వెళ్లి రావాల్సిందే..

ఇంతకీ విషయమేంటంటే.. స్వీడన్‌లోని వీధుల్లో సిగరెట్‌ తాగి పీకలను విసిరేసే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. స్వీడన్‌లో రోడ్లపై ఉండే చెత్తలో సుమారు 62 శాతం ఈ సిగరేట్‌ పీకలదే అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో అక్కడి ప్రభుత్వానికి ఇదొక పెద్ద సమస్యగా మారిపోయింది. స్వీడన్‌లో ఇలా సిగరేట్ పీకలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిలో సోడెర్టాల్జె మున్సిపాలిటీ ఒకటి. ఈ మున్సిపాలిటీ పరిధిలో రహదారులను శుభ్రం చేసేందుకు ఏటా రూ. 16 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది.

దీంతో ఎలాగైనా ఈ ఖర్చును తగ్గించాలే ఆలోచన చేసిన అక్కడి ప్రభుత్వం స్థానికంగా ఉన్న కోర్విడ్‌ క్లీనింగ్ అనే స్టార్టప్‌ కంపెనీతో ఓ ఒప్పందం చేసుకుంది. ఈ కంపెనీ కాకులతో చెత్తను శుభ్రం చేయించే ఓ అద్భుత ఆలోచన చేసింది. ఇందుకోసం కోర్విడ్ అనే జాతికి చెందిన కాకులను రంగంలోకి దింపారు. ఈ కాకులకు రోడ్డుపై పడ్డ సిగరెట్ పీకలను, చెత్తను డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చారు. ఇలా కాకి డబ్బలో చెత్త పడేయగానే ఆహారం వచ్చేలా సెటప్‌ చేశారు. దీంతో కాకి ఆహారం కోసం ఈ ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంటుంది.

దీంతో ఇటు రోడ్లు శుభ్రం అవుతుతాయి, అటు కాకికి ఆహారం లభిస్తుంది. ఈ వినూత్న ఆలోచనతో మున్సిపాలిటీ వారికి భారీగా కలిసొస్తుందంటా. ప్రస్తుతం కాకులకు మాత్రమే శిక్షణ ఇచ్చామని రానున్న రోజుల్లో ఇతర పక్షులను కూడా రంగంలోకి దింపుతామని అధికారులు చెబుతున్నారు. ఇదండీ ఈ క్లీనింగ్‌ కాకుల కథ. చూశారుగా అన్ని తెలిసిన మనుషులు చెత్తను రోడ్లపై పడేస్తుంటే, ఏమి తెలియని కాకులు రోడ్లను ఎలా శుభ్రం చేస్తున్నాయో.

ఇదిలా ఉంటే కాకులను ఇలా క్లీనింగ్‌ ఏజెంట్‌లుగా నియమించుకోవడం ఇదేతొలిసారి కాదు, 2018లో ఫ్రెంచ్‌ హిస్టారికల్‌ థీమ్‌ పార్క్‌లో సిగరెట్‌ పీకలను ఎరడానికి ఆరు కాకులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కాకులను కేవలం చెత్తడానికి ఉపయోగించడమే కాకుండా ఇలా చేయడం వల్ల పరిశుభ్రతపై ప్రజల్లోనూ అవగాహన పెరుగుతుందనే ఉద్దేశంతో అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: Yadadri Temple: యాదాద్రీశుడికి విరాళంగా మరో కిలో బంగారం ఇవ్వనున్న ఆ నియోజకవర్గ ప్రజలు..

తోక పట్టుకుంటే ఊరుకుంటుందా.. తిక్క కుదిర్చిందిగా.. వీడియో

Anti Aging Face Pack: వృద్ధాప్య ఛాయలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ప్యాక్‌తో చెక్ పెట్టండి..!