Viral Video: నువ్వు కూడా డబ్బు మజా మరిగావా..? మరి అక్కడకి ఎందుకు దూరావ్ మావ

ఆ అల్మరాలో బంగారు ఆభరణాలు కుప్పులు తెప్పలుగా ఉన్నాయ్. అంతేనా క్యాష్ కూడా చాలా మంది. అన్ని రూ. 500 నోట్లే. అయితే అక్కడే కోబ్రా కనిపించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. పాతకాలంలో నిధికి పాములను కాపలాగా పెట్టేవారని విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం అంటున్నారు నెటిజన్స్.

Viral Video: నువ్వు కూడా డబ్బు మజా మరిగావా..? మరి అక్కడకి ఎందుకు దూరావ్ మావ
Cobra

Updated on: Sep 26, 2025 | 5:40 PM

పాముల వీడియోలు ఈ మధ్య తెగ సర్కులేట్ అవుతున్నాయి. వర్షాకాలం కావడంతో అవి జనావాసాల్లోకి రావడం.. వాటిని స్నేక్ క్యాచర్స్ బంధించడం వంటి ఘటనలు చూస్తున్నాం. కొన్నిచోట్ల అయితే వివిధ రకాల వస్తువుల్లోకి పాములు దూరిన దాఖలాలు కూడా ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయ్యింది. ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వైరల్ వీడియోలో ఇనుప అల్మారాలో పెద్ద మొత్తంలో నగదు,, బంగారు ఆభరణాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈ వస్తువులతో పాటు ఒక నాగుపాము వాటికి కాపలా కాస్తున్నట్లు వీడియోలో ఉంది.

వీడియోలో కరెన్సీ నోట్లు, బంగారు ఆభరణాలతో నిండిన తెల్లటి ఇనుప అల్మారా కనిపిస్తుంది. వాటి మధ్య నాగుపాము పడగవిప్పి కూర్చుని ఉంది. పాముకు కదిపే ప్రయత్నం చేయగా.. అది కాటు వేయడానికి బుస కొట్టి రావడం మీరు చూడవచ్చు. ఈ వీడియో చూసిన తర్వాత, ఈ పాము అల్మారాలోకి ఎలా వచ్చిందో అని ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. కావాలనే పామును అక్కడ ఉంచారా? లేదా అది వచ్చి అక్కడ మకాం వేసిందా అన్నది స్పష్టంగా తెలియడం లేదు. పురాతన కాలంలో నిధినిక్షేపాలకు పాములు కాపలాగా ఉంచేవారని విన్నాం.. ఇప్పుడు చూస్తున్నాం అని కొందరు కామెంట్స్ పెడుతున్నారు.