బొట్టుపెట్టి పేరెంట్స్‌ని.. మీటింగ్‌కి పిలిచిన లెక్చరర్స్
చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను కాలేజ్‌లో చేర్పించగానే తమ పనైపోయిందనుకుంటారు. ఆ తర్వాత వాళ్లు ఎలా చదవుతున్నారు.. వారి ప్రవర్తన ఎలా ఉంది అనేది పట్టించుకోరు. అందుకే కళాశాల నిర్వాహకులు పేరెంట్-టీచర్ మీటింగ్స్ నిర్వహిస్తారు. అయితే.. చాలా సందర్భాల్లో ఈ మీటింగ్స్‌కు కూడా కొందరు పేరెంట్స్ అటెండ్ కారు.
అందుకే ఓ ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరెంట్-టీచర్ మీటింగ్‌కు అటెండ్ కావాలంటూ వాట్సప్ మెసేజ్‌లతో సరిపెట్టేయకుండా.. విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా వారిని మీటింగ్‌కు హాజరుకావాలని బొట్టుపెట్టి మరీ ఆహ్వానిస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. జగిత్యాల జిల్లా మల్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబరు 26న పేరెంట్స్-టీచర్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులు స్వయంగా విద్యార్ధుల ఇళ్లకు వెళ్లి, విద్యార్థుల తల్లిదండ్రులకు బొట్టు పెట్టి పేరెంట్స్ మీటింగుకు రావాలని ఆహ్వానించారు. జోరు వానలో రెయిన్ కోట్లు ధరించి మరీ వెళ్లి ఆహ్వాన పత్రిక అందించారు. గతంలో ఏర్పాటు చేసిన సమావేశాలకు రావడానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసక్తి చూపించకపోవడంతో అధ్యాపకులు ఇలా వినూత్నంగా ఆలోచించారు. బొట్టుపెట్టి కళాశాలలో నిర్వహించే విద్యార్థుల పేరెంట్స్ సమావేశానికి హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో శివరామకృష్ణ, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రుల కు తెలియజేసేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే, ఈసారి తప్పకుండా సమావేశానికి హాజరవుతామని.. ఈ సందర్భంగా విద్యార్ధుల తల్లిదండ్రులు హామీఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రంప్ వీసా రుసుము పెంపు వీరికి ప్లస్ కానుందా
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్! ఏటీఎం విత్‌డ్రా ఎప్పటి నుంచి అంటే
విమానాశ్రయంలో ప్రయాణికుడి ప్యాంట్‌లో దూరి కరిచిన ఎలుక
చాట్‌జీపీటీ సాయంతో రూ. 1.32 కోట్ల లాటరీ గెలిచిన మహిళ
Sink Hole: నడిరోడ్డుపై పేద్ద.. గొయ్యి.. పదుల సంఖ్యలో పడ్డ వాహనాలు
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్ తెరవగానే
కోటి రూపాయల ఫ్యాన్సీ నెంబర్ వేలంలో బిగ్ ట్విస్ట్
కిడ్నీ ఇచ్చి.. ప్రాణం పోసిన తండ్రి
కొడుకు కోసం భార్యాభర్తల మధ్య పంచాయితీ.. కట్ చేస్తే..
ప్రియుడి మృతదేహాన్ని పెళ్లి చేసుకుని.. కన్నీళ్లు పెట్టిన యువతి

