Viral Video: పామును పట్టి.. అక్కడే గొయ్యి తవ్విన స్నేక్ క్యాచర్.. కుప్పలు తెప్పలుగా..
Snake Viral Video: గత కొన్ని రోజులుగా బసవరాజు కట్టమణి ఇంటి సమీపంలో నాగుపాము సంచరిస్తోంది. దీంతో దాని వల్ల తనకు గానీ కుటుంబ సభ్యులకు గానీ ఏమైనా ప్రమాదం జరుగుతుందేమో అని భయపడి.. వెంటనే స్నేక్ క్యాచర్‌ను పిలిపించాడు.

ఒక్క పాము కనిపిస్తేనే జనాలు ఆమడదూరం పరిగెడతారు. పాములు అంటే మాగ్జిమమ్ జనాలకు భయం ఉంటుంది. అలాంటిది బొరియ లోపలి నుంచి కుప్పలు తెప్పలుగా నాగుపాములు బయలకు వస్తే ఏమైనా ఉంటుందా..? కర్ణాటకలో అలాంటి ఇన్సిడెంటే జరిగింది. ఓ ఇంటి పెరట్లో 25పైగా తాచు పాములు బయటపడ్డాయి. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.
కర్ణాటక ధార్వాడ జిల్లా కుందగోళ తాలూకాలోని హిరేహరకుని గ్రామానికి చెందిన బసవరాజు కట్టమణి ఇంటికి సమీపంతో గత కొంతకాలంగా పాము సంచరిస్తుంది. దీంతో అతడు భయపడి స్నేక్ క్యాచర్‌ను పిలిచి.. తన ఇంటి పరిసర ప్రాంతాల్లో వెతికించాడు. దీంతో నాగుపాము చిక్కింది. అదే ప్రాంతంలో సన్నని బొరియ కనిపించడంతో.. స్థానికుల సాయంతో తవ్వకాలు జరిపాడు. దీంతో ఆ కన్నం లోపలి నుంచి నాగు పాము పిల్లలు కుప్పులు తెప్పులుగా బయటకు వచ్చాయి. అవి కూడా పడగల విప్పడంతో స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు. మొత్తం 25 పిల్లలు లెక్కతేలాయి. వాటన్నింటిని చాకచక్యంగా బంధించిన స్నేక్ క్యాచర్.. ఓ డబ్బాలో భద్రపరిచాడు. ఆపై తీసుకెళ్లి వాటిని సురక్షిత అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. పాములు కనిపిస్తే వాటికి హాని కలిగించకుండా తమకు సమాచారం ఇవ్వాలని.. స్నేక్ క్యాచర్.. స్థానికులకు సూచించాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.